Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఆర్‌సీబీ కోచింగ్ బృందంలో చేరిన మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా

Ashish Nehra joins RCB coaching team

హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచింగ్ బృందంలో చేరాడు. గతేడాది బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నెహ్రా ఇప్పుడు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆర్‌సీబీ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌‌లో పేర్కొంది.

వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఆర్‌సీబీ చీఫ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్‌స్టెన్‌తో కలిసి నెహ్రా పని చేయనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియేల్ వెటోరితో సహా పాత కోచింగ్ బృందాన్ని మొత్తాన్ని తొలగించిన ఆర్‌సీబీ యాజమాన్యం కేవలం ఈ ఇద్దరికే బాధ్యతలు అప్పగించింది.

ఈ సందర్భంగా నెహ్రా మాట్లాడుతూ "ఆర్‌సీబీతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నాయకుడిగా అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. రాబోయే సీజన్‌లో జట్టును విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తా" అని నెహ్రా పేర్కొన్నాడు. భారత్ తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టెస్టులు ఆడిన నెహ్రా.. ఐపీఎల్‌లోనూ విజయవంతమయ్యాడు.

Story first published: Thursday, September 6, 2018, 9:24 [IST]
Other articles published on Sep 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+