ఐపీఎల్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన తొలి ఇండియన్‌గా గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 టోర్నమెంట్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులైన టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ ట్రోఫీ సాధించిన జట్టుకు ప్రధాన్ కోచ్‌గా ఉన్నవారిలో మొట్టమొదటి భారతీయ ప్రధాన్ కోచ్ అతనే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడానికి కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ రాటుదేలింది. ఇక మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై 7వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ సీజన్లోనే ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

సరిగ్గా ఆరేళ్ల క్రితం
సరిగ్గా ఆరేళ్ల క్రితం మే 29న.. నెహ్రా ప్లేయర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2016 సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఆ జట్టు అప్పట్లో గెలిచింది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్ రైజర్స్.. ఆ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ని ఓడించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్‌గా, ప్రధాన కోచ్‌గా ట్రోఫీ గెలిచిన వ్యక్తిగా ఆశిష్ నెహ్రా నిలిచాడు. అంతకుముందు రికీ పాంటింగ్, షేన్ వార్న్ ఈ ఘనత సాధించారు.

అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన ప్రధాన కోచ్‌లు
స్టీఫెన్ ఫ్లెమింగ్ (చెన్నై సూపర్ కింగ్స్) - 4
మహేలా జయవర్దనే (ముంబై ఇండియన్స్ ) - 3
ట్రెవర్ బేలిస్ (కోల్ కతా నైట్ రైడర్స్) - 2
ఆశిష్ నెహ్రా (గుజరాత్ టైటాన్స్) - 1
టామ్ మూడీ (సన్ రైజర్స్ హైదరాబాద్) - 1
రికీ పాంటింగ్ (ముంబై ఇండియన్స్) - 1
జాన్ రైట్ (ముంబై ఇండియన్స్) - 1
డారెన్ లెమాన్ (డెక్కన్ ఛార్జర్స్) - 1
షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్) - 1

నెహ్రా వద్ద చాలా ట్యాక్టిక్స్ ఉన్నాయి
గుజరాత్ ప్రధాన కోచ్ నెహ్రా, మెంటర్ గ్యారీ కిర్‌స్టన్ కలిసి గుజరాత్ టైటాన్స్‌కు అత్యుత్తమ సలహాలు, మార్గదర్శకత్వం అందించారు. తద్వారా గుజరాత్ టైటాన్స్ తమ అరంగేట్ర సీజన్‌లో అద్భుతాలు చేసింది. టైటిల్ విజయం తర్వాత.. కిర్‌స్టెన్ మాట్లాడుతూ.. 'నెహ్రాతో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అతని వద్ద చాలా ట్యాక్టిక్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. అతను వ్యూహాత్మకంగా నిజంగా చాలా దృడమైన మైండ్ సెట్ కలిగి ఉంటాడు. గేమ్ ప్లాన్‌ను రూపొందించడం అంత సులభం కాదు. ప్రతి గేమ్‌లో చాలా వేరియబుల్స్ ఉంటాయి. గేమ్‌లను గెలవడానికి ప్లేయర్లు ఆడిన విధానం నిజంగా మెచ్చుకోదగ్గది' అని కిర్‌స్టన్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications