Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త బాధ్యతలు: బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా

Ashish Nehra, Gary Kirsten Join RCB Coaching Setup, Vettori to Remain Head Coach

హైదరాబాద్: కొద్ది నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్రస్తుతానికి కామెంటటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు, త్వరలో బౌలింగ్‌ కోచ్‌ అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు అన్ని పూర్తయ్యాయి. ఇక బాధ్యతలు స్వీకరించడమే మిగిలి ఉంది. ఇంతకీ నెహ్రా బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జట్టు ఇదే.

ఐపీఎల్‌లో డానియేల్ వెట్టోరీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తోన్న జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌. బెంగళూరుకు చెందిన ఈ జట్టు చేస్తున్న సన్నాహాల్లో భాగంగా ఈ ఏడాది సీజన్‌ కోసం ఆశిష్‌ నెహ్రాను బౌలింగ్‌ కోచ్‌గా ఎన్నుకుంది. దాంతోపాటుగా మెంటార్‌గానూ అతడు బాధ్యతలు నిర్వహించనున్నాడు.

ఆశిష్ నెహ్రాతో పాటుగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌కు ఆర్‌సీబీ బ్యాటింగ్‌ మెంటార్‌, కోచ్‌ బాధ్యతలను అప్పగించారు. ఆర్‌సీబీకి డానియల్‌ వెటోరీ ప్రధాన కోచ్‌గానే కొనసాగనున్నాడు. జనవరి 27, 28న ఈ ఏడాది ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ వేలం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో నెహ్రా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్యారీ బిగ్‌బాష్‌ లీగ్‌లో హాబర్ట్‌ హరికేన్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గత మూడు ఐపీఎల్‌ సీజన్లలో గ్యారీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 2, 2018, 13:08 [IST]
Other articles published on Jan 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+