For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాగ్‌పూర్‌లో రెండో వన్డే: ధావన్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్?

India Vs Australia 2019,2nd ODI : Dhawan Is One Good Knock Away From Finding Form Says Ashish Nehra
Ashish Nehra feels Shikhar Dhawan needs just one knock to get his confidence back

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో డకౌటైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశమివ్వాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ "ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలనే ఆశిస్తాడు. అవును.. శిఖర్ ధావన్ గత కొద్దిరోజులుగా విఫలమవుతున్నాడు. అతను ఫామ్ అందుకోవాల్సి ఉంది. అది కూడా ఎంతో దూరంలో లేదు. అతను ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు" అని అన్నాడు.

మరోవైపు, కేఎల్ రాహుల్ ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టీ20ల్లో రాణించకపోయి ఉంటే ఇప్పుడు ధావన్‌‌ ఫామ్‌ గురించి ఎవరైనా ప్రశ్నించేవారా? అని ఆశిష్ నెహ్రా తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో కేఎల్ రాహుల్ 50, 47 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే.

2019లో 9 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ, వరల్డ్ కప్ ముంగిట ధావన్ ఫెయిల్ అవడంతో అతడిపై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం కూడా వరల్డ్ కప్ జట్టులో అతడి స్థానంపై పోటీ నెలకొంది.

ఆస్ట్రేలియాతో మిగిలిన నాలుగు వన్డేల్లో శిఖర్ ధావన్ ఫామ్‌ నిరూపించుకుంటే తప్ప.. మే నెలలో జరిగే వరల్డ్ కప్‌ జట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే నాగ్‌పూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.

Story first published: Monday, March 4, 2019, 17:27 [IST]
Other articles published on Mar 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+