Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌ ఐదో టెస్టు: మిచెల్ మార్ష్ విజృంభణ.. కష్టాల్లో ఇంగ్లండ్‌!!

Ashesh 2019: Jos Buttler fights back after England fail to take advantage of Australia mistakes Save

లండన్‌: యాషెస్‌ సిరీస్ చివరిదైన ఐదో టెస్టులో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ విజృంబించాడు. బట్లర్ హాజల్‌వుడ్‌, పాట్ కమ్మిన్స్ లాంటి ఆసీస్ స్టార్ పేసర్ల కంటే నిప్పులు చెరిగే బంతులతో మార్ష్ నాలుగు వికెట్లు తీయడంతో ఆతిధ్య ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ఓవల్‌ మైదానంలో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మార్ష్ దెబ్బకు ఇంగ్లండ్‌ ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

డెన్లీ విఫలం:

డెన్లీ విఫలం:

ఐదో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ ఆరంబించింది. రోరీ బర్న్స్, జో డెన్లీలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. బర్న్స్ (44) ఇబ్బంది లేకుండా బాగానే ఆడినా.. డెన్లీ (14) విఫలమయ్యాడు. డెన్లీ త్వరగానే ఔటైనా బర్న్స్‌ (87 బంతుల్లో 47; 7 ఫోర్లు) తోడుగా కెప్టెన్‌ జో రూట్‌ (141 బంతుల్లో 57; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించింది.

ఎట్టకేలకు అర్ధ శతకం:

ఎట్టకేలకు అర్ధ శతకం:

ఆసీస్ ఫీల్డర్లు మూడుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన రూట్ ఎట్టకేలకు అర్ధ శతకం చేశాడు. 103/1తో ఆతిథ్య జట్టు మెరుగ్గా కనిపించిన స్థితిలో హాజల్‌వుడ్‌ ఓ అద్భుత బంతితో బర్న్స్‌ను పెవిలియన్ చేర్చాడు. స్టోక్స్ (20) ధాటిగానే ఆడినా.. రూట్ ఇబ్బంది పడుతూ ఆడాడు. ఈ సమయంలో స్టోక్స్‌ను మార్ష్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ టీ విరామంకు వెళ్ళింది.

మార్ష్ విజృంభణ:

మార్ష్ విజృంభణ:

ఇక టీ విరామం అనంతరం రూట్‌ను కమిన్స్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి. ఇది చాలక మార్ష్ మళ్లీ దెబ్బకొట్టాడు. వరుసగా బెయిర్‌ స్టో (22), కరన్‌ (15), వోక్స్‌ (2)లను ఔట్‌ చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా బట్లర్ (84 బంతుల్లో 64 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రం దూకుడుగా ఆడి కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేసాడు. ఆర్చర్ (9) కూడా ఎక్కువ సమయం క్రీజులో నిలవలేదు.

బట్లర్ పోరాటం:

బట్లర్ పోరాటం:

అయితే లీచ్‌ (31 బంతుల్లో 10 బ్యాటింగ్‌; ఫోర్‌)తో కలిసి బట్లర్ పోరాడాడు. హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాది మంచి ఊపులో కనిపించాడు. ఈ క్రమంలోనే అబేధ్యమైన 9 వికెట్‌కు 45 పరుగులు జత చేశాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌తో పాటు జాక్ లీచ్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా... కమిన్స్, హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, September 13, 2019, 9:28 [IST]
Other articles published on Sep 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+