యాషెస్‌ ఐదవ టెస్టు.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

Ashesh 2019: Australia have won the toss and have opted to field

ఓవల్‌: యాషెస్ సిరీస్ చివరి అంకానికి చేరింది. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో చివరిదైన ఐదవ టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. సామ్ కరన్‌, క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ కూడా రెండు మార్పులు చేసింది. మిచెల్ మార్ష్, పీటర్ సిడిల్ జట్టులోకి చేరారు.

'ధావన్, రోహిత్ లోపాలను సరిదిద్దా.. బ్యాట్స్‌మెన్‌ పాత టెక్నిక్‌లు వదిలేసేలా కృషిచేశా'

ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు గెలువగా, ఇంగ్లాండ్‌ ఒక మ్యాచ్‌ గెలిచింది. ఓ మ్యాచ్‌ డ్రా అయింది.

దీంతో ఇప్పటికే ఆసీస్‌ 2-1తో ట్రోఫీని నిలబెట్టుకోగా.. మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. 18 ఏండ్ల నుంచి ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ నెగ్గాలని తహతహలాడుతున్న కంగారూల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉండగా, బౌలర్లు సైతం విజృంభిస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ చివరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

రెండు నెలల క్రితం వన్డే ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ముఖ్యంగా జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్‌ రూట్‌ ఫామ్‌ ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోంది. ఇప్పటికైనా అతడు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. గాయంతో బాధపడుతున్న స్టోక్స్‌ బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. బెయిర్‌స్టో, బట్లర్ ఏ మాత్రం రాణించడం లేదు.

ఓపెనర్లు విఫలమయినా.. స్మిత్ జట్టును ఆదుకుంటున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్‌ 671 పరుగులు చేయాడు. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్‌లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్‌ మాత్రమే. ఈ సిరీస్‌లో అతడి అత్యల్ప స్కోరు 82 అంటేనే అతడు ఎంత భీకర ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇతన్ని త్వరగా ఔట్ చేస్తేనే.. ఇంగ్లాండ్ విజయంపై ధీమాగా ఉండొచ్చు.

Teams:

England: Rory Burns, Joe Denly, Joe Root(c), Ben Stokes, Jonny Bairstow(w), Jos Buttler, Sam Curran, Chris Woakes, Jofra Archer, Jack Leach, Stuart Broad.

Australia: Marcus Harris, David Warner, Marnus Labuschagne, Steven Smith, Mitchell Marsh, Matthew Wade, Tim Paine(w/c), Pat Cummins, Peter Siddle, Nathan Lyon, Josh Hazlewood.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 12, 2019, 16:08 [IST]
Other articles published on Sep 12, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more