Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టిమ్‌ పైన్‌ ముందు అరుదైన అవకాశం.. యాషెస్‌ గెలిస్తే చరిత్రే!!

Ashesh 2019: Australia captain Tim paine verge ashes landmark

మాంచెస్టర్‌: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు యాషెస్‌ సిరీస్‌ ఎంతో ప్రతిష్టాత్మకం. ఒక సంవత్సరం ఇంగ్లండ్‌ గడ్డపై, మరో సంవత్సరం ఆస్ట్రేలియా గడ్డపై జరిగే ఈ సిరీస్ కోసం ఇరు జట్లు మైదానంలో హోరాహోరీగా తలపడతాయి. సొంత గడ్డపై ఆసీస్‌-ఇంగ్లండ్‌లు సిరీస్ కోల్పోయిన సందర్బాలు చాలా తక్కువ. అయితే ఈసారి సొంత గడ్డపై ఇంగ్లండ్‌ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇదే సమయంలో ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ను ఓ అరుదైన అవకాశం ఊరిస్తోంది.

దిగ్గజాలకే సాధ్యం కాలేదు:

దిగ్గజాలకే సాధ్యం కాలేదు:

ఆసీస్‌ దిగ్గజ కెప్టెన్‌లు గ్రెగ్‌ చాపెల్‌, రికీ పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌ వంటి వారికి సాధ్యం కానిది.. అనుకోకుండా కెప్టెన్‌ అయిన పైన్‌ ముంగిట ఉంది. ఇంగ్లండ్‌ గడ్డపై ఆసీస్‌ యాషెస్‌ సిరీస్‌ను గెలిచిన సందర్బాలు చాలా తక్కువ. 2001లో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఆసీస్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌ను గెలిచింది. 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ గడ్డపై చివరిసారిగా యాషెస్‌ సిరీస్‌ గెలిన ఆసీస్.. ఇప్పటివరకూ మళ్లీ సిరీస్‌ను గెలవలేదు.

అరుదైన అవకాశం:

అరుదైన అవకాశం:

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో టిమ్‌ పైనీ నేతృత్వంలోని ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టును ఆసీస్‌ గెలవగా.. రెండో టెస్టు డ్రా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్‌.. నాలుగో టెస్టులో ఆసీస్‌లు విజయం సాధించాయి. ప్రస్తుతం ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే చివరి టెస్టును ఆసీస్‌ గెలిస్తే.. పైన్‌ అరుదైన ఘనతను సాధిస్తాడు. అంతేకాదు ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ను గెలవలేకపోతున్న అపవాదుకు కూడా అతడు చెరిపేయనున్నాడు.

యాషెస్‌ గెలిస్తే చరిత్రే:

యాషెస్‌ గెలిస్తే చరిత్రే:

2010లో ఆసీస్‌ తరఫున పైన్‌ అరంగేట్రం చేసాడు. ఆటగాళ్ల ఫామ్ కారణంగా టెస్టుల్లో ఆసీస్‌ జట్టుకు అప్పుడప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోవడంతో.. వారికి కెప్టెన్ అయ్యే అవకాశం లేదు. దీంతో పైన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐదో యాషెస్‌ టెస్టులో ఆసీస్‌ విజయం సాధిస్తే ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ సిరీస్‌లు గెలిచిన కొద్ది మంది ఆసీస్‌ కెప్టెన్ల జాబితాలో పైన్‌ చోటు సంపాదిస్తాడు.

Story first published: Tuesday, September 10, 2019, 13:37 [IST]
Other articles published on Sep 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+