న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ ఐదో టెస్టు: ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యం.. 56 పరుగులకే 3 వికెట్లు

Ashesh 2019, 5th Test: Broad bagged the wickets of the openers, Labuschagne departs, Australia in more trouble

లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ జోరు సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 313/8తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 16 జోడించి 329 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 398 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. మరో రికార్డుపై రోహిత్ శర్మ గురి!!దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. మరో రికార్డుపై రోహిత్ శర్మ గురి!!

ఛేదనలో 18 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఓపెనర్ మార్కస్ హ్యారిస్ (9) బౌల్డయ్యాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11) కూడా బ్రాడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మార్కస్ లబషేన్, స్టీవ్ స్మిత్ ఆదుకున్నారు. ఈ జోడి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లీచ్ బౌలింగ్‌లో లబషేన్ (14) స్టంపౌట్ అవ్వడంతో ఆసీస్ మరింత కష్టాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

క్రీజులో స్మిత్ (16), వేడ్ (5) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది. బ్రాడ్, ఆర్చర్, లీచ్‌ నిప్పులు చెరుగుతున్నారు. ఇంకా ఐదు సెషన్ల ఆట ఉండంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో డెన్లీ (206 బంతుల్లో 94; 14 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్ (67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 225 స్కోరు చేసింది. మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ గెలిస్తే.. సిరీస్‌ 2-2తో సమంగా ముగుస్తుంది. ఒకవేళ ఆసీస్‌ గెలిస్తే 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ గెలిచినట్లు అవుతుంది.

Story first published: Sunday, September 15, 2019, 17:37 [IST]
Other articles published on Sep 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X