For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డీఆర్‌ఎస్‌ మాకు పీడకలలా మారింది.. నేను అంపైరింగ్‌ స్కూల్‌లో చేరాలేమో!!

Ashesh 2019, 5th Test: Australia Are Having A mare With Ashes DRS Calls says Tim Paine

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ మాకు పీడకలలా మారింది. బహుశా నేను అంపైరింగ్‌ స్కూల్‌లో చేరాలేమో అని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైనీ అన్నాడు. మూడో టెస్టులో పైనీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఆసీస్ ఓడిపోయిందని ఆ దేశ మాజీలు విమర్శించిన విషయం తెగెలిసిందే. ఇంగ్లండ్‌ 11వ ఆటగాడు జాక్‌ లీచ్‌ ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లడాన్ని మాజీలు ప్రశ్నించారు. మా కెప్టెన్‌కు మతిపోయినట్లుందని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ విమర్శంచగా.. అనవసరంగా రివ్యూని వృథా చేసాడు అని మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అన్నాడు.

చివరిదైన ఐదవ టెస్టులో కూడా పైనీ డీఆర్‌ఎస్‌లో సఫలం కావడంలో మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు సార్లు రివ్యూకు వెళ్లినా.. అతనికి చుక్కెదురైంది. తాజాగా దీనిపై పైనీ మాట్లాడుతూ... 'డీఆర్‌ఎస్‌కు వెళ్లినా మాకు అనుకూలంగా ఫలితం మాత్రం రావడం లేదు. ఎందుకో నాకు తెలీదు. డీఆర్‌ఎస్‌ మాకు పీడకలలా మారింది. అంపైర్ల నిర్ణయాలకు మనం గౌరవం ఇవ్వాలి. కానీ.. ఔట్‌ని కచ్చితంగా భావించి రివ్యూకు వెళుతున్నా సఫలం కావడం లేదు. బహుశా నేను అంపైరింగ్‌ స్కూల్‌లో చేరాలేమో' అని పైనీ పేర్కొన్నాడు.

యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ జోరు కనబరుస్తోంది. ఐదో టెస్టులపై ఇంగ్లండ్‌ పట్టు సాధించింది. ఓపెనర్‌ జాన్‌ డెన్లీ (94), ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ (67) అర్ధ శతకాలు చేసి రాణించడంతో యాషెస్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ ఓవరాల్‌గా 398 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఓపెనర్లు హారిస్ (9), వార్నర్ (11) వికెట్లను కోల్పోయింది. బ్రాడ్ రెండు వికెట్లను తీసాడు. క్రీజులో లబషేన్ (9), స్మిత్ (4) ఉన్నారు.

ఆసీస్ విజయానికి ఇంకా 360 పరుగులు వెనుకబడి ఉంది. బ్రాడ్, ఆర్చర్, లీచ్‌ నిప్పులు చెరుగుతున్నారు. ఇంకా ఐదు సెషన్ల ఆట ఉండంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ గెలిస్తే.. సిరీస్‌ 2-2తో సమంగా ముగుస్తుంది. ఒకవేళ ఆసీస్‌ గెలిస్తే 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ గెలిచినట్లు అవుతుంది.

Story first published: Sunday, September 15, 2019, 17:13 [IST]
Other articles published on Sep 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+