యాషెస్ 2019: 71 ఏళ్ల రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో స్టీవ్ స్మిత్(80) హాఫ్ సెంచరీతో రాణించడంతో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా ఆరు సార్లు 80కిపైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. స్మిత్ (145 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 80) మరోసారి ఒంటరిపోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 68.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

వరుసగా 80కిపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా
ఈ క్రమంలో సర్ ఎవర్టన్ వీక్స్ తర్వాత టెస్టుల్లో వరుసగా 80కిపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ స్కోర్లు 144, 142, 92, 211, 82, 80 ఇలా ఉన్నాయి. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ చేసిన పరుగులు 761. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనా.. స్మిత్ ఈ పరుగులు చేయడం విశేషం.

స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించడంతో
అదే సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ జట్టుపై వరుసగా పదో హాఫ్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇంజమామ్ ఇంగ్లండ్‌పైనే 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో స్మిత్, హక్‌ల తర్వాత స్థానాల్లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్(8, ఇంగ్లండ్‌పై), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కల్లిస్(8, పాకిస్తాన్‌పై), శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(8, బంగ్లాదేశ్‌పై ) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ డబుల్ సెంచరీ సాధిస్తే ఒక సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుని బద్దలు కొడతాడు.

డాన్ బ్రాడ్‌మన్ 974 పరుగులు
1930లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 974 పరుగులు చేశాడు. ఓ యాషెస్ సిరిస్‌లో ఇవే ఇప్పటివరకు అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌కు ఈ రికార్డు బద్దలు కొట్టడం పెద్ద విషయమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం
కాగా, ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/62) విజృంభణతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్‌కు ఐదు, కమిన్స్‌కు మూడు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9/0తో నిలిచింది. క్రీజులో బర్న్స్ (4), డెన్లీ (1) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications