Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్నీ రికార్డు సమం: మెల్‌బోర్న్ టెస్టు సెంచరీతో కుక్ సరికొత్త రికార్డు

Ashes Stats: Alastair Cook joins Sunil Gavaskar in scoring tons at all five of Australia's main Test grounds

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ అరుదైన ఘనత సాధించాడు. రెండో రోజు ఆటలో భాగంగా అలెస్టర్ కుక్ (104 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

టెస్టుల్లో అలెస్టర్ కుక్‌కు ఇది 32వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో అలెస్టర్ కుక్ ఆస్ట్రేలియాలో యాషెస్ టెస్టు సిరిస్ జరిగే ఐదు మైదానాల్లో సెంచరీలు చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. యాషెస్ టెస్టు సిరిస్ జరిగే బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీ మైదానాల్లో సెంచరీలు సాధించాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని సమం చేశాడు. సునీల్ గవాస్కర్ కూడా గతంలో ఈ ఐదు మైదానాల్లో టెస్టు సెంచరీలను నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ టెస్టు సిరిస్‌లో అలెస్టర్ కుక్ అత్యధిక స్కోరు 96. 2015లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ స్కోరుని సాధించాడు.

యాషెస్ సిరిస్‌లో ఆరు హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. అదే ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ టెస్టు సిరిస్ విషయానికి వస్తే 10 హాఫ్ సెంచరీల్లో ఐదు సెంచరీలుగా మలిచాడు. ఆస్ట్రేలియాలోని ప్రధాన మైదానాల్లో అలెస్టర్ కుక్ సెంచరీలు ఏయే సంవత్సరాల్లో చేశాడంటే..

116 - పెర్త్ 2006
235 నాటౌట్ - బ్రిస్బేన్ 2010
148 - అడిలైడ్ 2010
189 - సిడ్నీ 2011
104 నాటాట్ - మెల్ బోర్న్ 2017

ఆస్ట్రేలియాలో పర్యాటక జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్లు ఏయే మైదానాల్లో ఎన్ని సెంచరీలు చేశారంటే...

ఒక వేదికలో: 122 మంది క్రికెటర్లు
రెండు వేదికల్లో: 34 మంది క్రికెటర్లు
మూడు వేదికల్లో: 14 మంది క్రికెటర్లు
నాలుగు వేదికల్లో: డేవిడ్ గోవెర్, వివ్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, క్రిస్ బ్రాడ్, జాన్ ఎడ్రిచ్, క్లైవ్ లాయిడ్, సచిన్ టెండూల్కర్
ఐదు వేదికల్లో: అలెస్టర్ కుక్, సచిన్ టెండూల్కర్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 18:22 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+