గబ్బాలో సెంచరీ: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డుని అధగమించాడు.

అత్యంత వేగంగా 21 సెంచరీలు
టెస్టుల్లో అత్యంత వేగంగా 21 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ముడో స్ధానంలో నిలిచాడు. 21 టెస్టు సెంచరీలను సాధించడానికి స్మిత్‌కు 105 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, సచిన్ టెండూల్కర్ 110 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో నలుగురు మాత్రమే ఉండగా తాజాగా స్మిత్ కూడా చేరాడు. ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 21 టెస్టు సెంచరీలను 56 మ్యాచ్‌ల్లో పూర్తి చేసి ఈ జాబితాలో అందరికంటే అగ్రస్ధానంలో నిలిచాడు.

రెండో స్ధానంలో సునీల్ గవాస్కర్
ఆ తర్వాత భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (98) ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. యాషెస్ తొలి టెస్టులో స్మిత్ సెంచరీని నమోదు చేయడంతో సచిన్ స్ధానాన్ని ఆక్రమించాడు. ఐదోస్థానంలో పాకిస్తాన్‌కు చెందిన యూసఫ్ యుహానా ఉన్నాడు.

21 టెస్టు సెంచరీలను తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సాధించిన వారు:
1. బ్రాడ్‌మన్ - 56
2. గవాస్కర్ - 98
3. స్టీవ్ స్మిత్ - 105
4. టెండూల్కర్ - 110
5. యూసఫ్ యుహానా - 120

21వ టెస్టు సెంచరీని సాధించిన స్మిత్
కాగా, తొలి టెస్టులో 261 బంతులాడిన స్మిత్ తన టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం స్మిత్ తన హెల్మెట్ తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ.. ఛాతి పైభాగంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు లోగోపై బలంగా తాకుతూ తనదైన శైలిలో విజయ గర్వం ప్రదర్శించాడు. దీంతో మైదానంలో ఉన్న అభిమానుల కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. స్మిత్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 130.3 ఓవర్లకు గాను 328 పరుగులు చేసిన ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై 26 పరుగుల ఆధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications