Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్ సిరిస్ నుంచి అవుట్: మూల్యం చెల్లించుకున్న స్టోక్స్

హైదరాబాద్: తప్పతాగి ఓ వ్యక్తిపై పిడిగుద్దులు గుప్పించిన కేసులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌ జట్టు నుంచి బెన్ స్టోక్స్‌ను ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తప్పించింది.

నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెన్ సిరిస్ కోసం స్టోక్స్‌ స్థానంతో స్టీవెన్‌ ఫిన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అక్టోబర్ 26వ తేదీ రాత్రి బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌ బయట స్టోక్స్‌ మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులతో తీవ్రంగా గొడవపడి బెన్‌స్టోక్స్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

 Ashes series: Ben Stokes withdrawn from England squad, Steven Finn added

ఈ ఘటనపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణకు ఆదేశించింది. బెన్ స్టోక్స్‌పై పోలీసు కేసు ఉండడంతోనే అతన్ని యాషెస్‌ సిరీస్‌ నుంచి తప్పించామని, అయితే అతడు 2017-18 సంవత్సరానికి గాను ఈసీబీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో కొనసాగుతాడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ పేర్కొన్నాడు.

కాగా, బెన్‌స్టోక్స్‌కి సంబంధించిన కేసులో పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కోసం ఎదురుచూస్తున్నారు. నైట్‌క్లబ్‌ బయట స్టోక్స్‌ మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులతో తీవ్రంగా గొడవపడి ఘటనలో స్టోక్స్‌ని ఓ రాత్రంతా జైల్లో ఉంచి విచారించిన అనంతరం పోలీసులు విడిచిపెట్టారు.

కానీ.. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ కొనసాగించేందుకు ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తుల సాక్షం కావాలని పోలీసులు అంటున్నారు. గొడవ ఘటనకి సంబంధించిన వీడియోని స్థానిక న్యూస్ పేపర్ బహిర్గతం చేయడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టు నుంచి బెన్‌స్టోక్స్‌ని తప్పించింది.

ఈ కేసు నిరూపణ అయితే కనీసం ఐదేళ్లు శిక్ష పడనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నవంబరు‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ నుంచి కూడా తప్పించింది. దీంతో ప్రస్తుతానికి బెన్ స్టోక్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, త్వరలోనే కేసు‌ కొలిక్కి వస్తుందని పోలీసులు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+