Ashes Series 2021: దెబ్బ కొట్టిన కమిన్స్.. అప్పుడే సగం టీం ఔట్

మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ను పర్యటక ఇంగ్లండ్ జట్టు నిరాశజనకంగా ప్రారంభించింది. మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఇంగ్లండ్ ఓపెనర్ హసీబ్ హమీద్‌ను పరుగులేమి చేయనీయకుండా డకౌట్‌గా వెనక్కి పంపాడు.
దీంతో 4 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 13 పరుగుల వద్ద ఉండగా మరోసారి దెబ్బ కొట్టాడు కమిన్స్. 12 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ విజృంభించిన కమిన్స్.. 14 పరుగులు చేసిన మలాన్‌ను ఔట్ చేశాడు. కమిన్స్ ధాటికి ఇంగ్లండ్ మొదటి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న కెప్టెన్ రూట్
61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఆ జట్టు కెప్టెన్ జో రూట్ ఆదుకున్నాడు. ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో రూట్‌కు ఇది 53వ హాఫ్ సెంచరీ. అయితే హాఫ్ సెంచరీతో క్రీజులో కుదురుకున్న రూట్‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు.
దీంతో ఇంగ్లండ్ జట్టు 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో కాసేపు నడిపించారు. ఈ క్రమంలో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను ఐదో వికెట్‌గా కామెరాన్ గ్రీన్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 115 పరుగులే సగం వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోంది. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాల్సిందే. కనీసం మ్యాచ్‌ను డ్రా చేసుకున్న సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఇంగ్లండ్ జట్టు
హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్.
ఆస్ట్రేలియా జట్టు:
మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుశేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications