అలెక్స్ కారీకి గొప్ప నైపుణ్యం ఉంది.. భవిష్యత్ వికెట్‌కీపర్ అతడే!!

సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ కారీకి గొప్ప నైపుణ్యం ఉంది. భవిష్యత్ ఆసీస్ వికెట్‌కీపర్ కారీనే అని మరో వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అలెక్స్ కారీకి ఆసీస్ సెలెక్టర్లు చోటు కల్పించలేదు. యాషెస్ సిరీస్ కోసం వికెట్‌కీపర్‌లుగా టిమ్ ఫైన్, మాథ్యూ వేడ్‌లు ఎంపికయ్యారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

మాజీల అసంతృప్తి
కారీకి యాషెస్ సిరీస్‌లో చోటు కల్పించకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌లో కారీ అద్భుతంగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు విలువైన పరులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. మంచి ఫామ్ కనబరుస్తున్న కారీని యాషెస్‌లో పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదని షేన్ వార్న్, మార్క్ వా ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్ అతడిదే:
ఈ నేపథ్యంలో మాథ్యూ వేడ్ మాట్లాడుతూ... 'అలెక్స్ కారీకి గొప్ప నైపుణ్యం ఉంది. కారీ ఆస్ట్రేలియా భవిష్యత్ వికెట్‌కీపర్ అవుతాడని భావిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకుంటే ఇదంతా జరగటానికి కొంత సమయం పడుతుంది' అని వేడ్ పేర్కొన్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో మాథ్యూ వేడ్ ఆడుతున్నాడు.

టిమ్‌కు ఏదైనా జరిగితే:
'వికెట్‌కీపర్ స్థానం కోసం ఆరాటపడడం లేదు. ఆసీస్ తరపున 20 టెస్టులు, చాలా వన్డే మ్యాచ్‌లు ఆడాను. చాలా గర్వంగా ఉంది. టిమ్‌కు ఏదైనా జరిగితే తుది జట్టులోకి వస్తా. ఒకవేళ చోటు దక్కితే ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడైనా ఆడుతా. చాలా రోజులుగా జాతీయ జట్టుకు ఆడలేదు. మళ్లీ జట్టుతో కలవడం ఆనందంగా ఉంది' అని వేడ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications