Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్: బాక్సింగ్ డే టెస్టుకు మిచెల్ స్టార్క్ అనుమానమే!

Ashes: Mitchell Starc still in doubt for Boxing Day Test

హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెర్త్‌లోని వాకా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ముగిసిన మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ కాలి మడమకు గాయమైంది. స్టార్క్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది.

బుధవారం (డిసెంబర్ 20)న మిచెల్ స్టార్క్ సిడ్నీలో తన కాలి మడమకు స్కానింగ్ పరీక్షలు చేయించుకోనున్నాడు. ఈ పరీక్షల అనంతరం బాక్సింగ్ టెస్టులో మిచెల్ స్టార్ ఆడతాడా లేదా అనేది తెలుస్తుంది. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆసీస్ ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సిడ్నీలో స్కానింగ్ పరీక్షల అనంతరం ఈ వారంతానికి మిచెల్ స్టార్క్ మెల్‌బోర్న్‌లో జట్టుతో కలవనున్నాడు.

కాగా, ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 (మంగళవారం) నుంచి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా 3-0తో ఆధిక్యంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 12:35 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+