
హైదరాబాద్: క్రికెట్ మైదానం విషయంలో ఆస్ట్రేలియా చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా పూర్ ర్యాంకింగ్‌ను సంపాదించుకుంది. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 30 శనివారం వరకు జరిగిన యాషెస్ సిరీస్ మ్యాచ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. అయితే తాజాగా ఈ మైదానం గురించి ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మడుగల్లే అధికారికంగా విడుదల చేసిన ఫలితాల్లో మెల్‌బోర్న్ వేదికపై జాలి చూపించింది. ఒకే ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 327, 263 (నలుగురు డిక్లేర్ చేశారు), ఇంగ్లాండ్ 491 స్కోరు చేయడం పట్ల విముఖత వ్యక్తం చేసింది.
ఈ నివేదికను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు పంపించింది. మరో 14రోజుల్లో వారు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఇంకా ఐసీసీ ప్రతినిధి మాట్లాడుతూ, 'మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం(ఎంసీజే) లో బౌన్స్‌లు సాధారణ స్థాయిలో పడుతున్నాయి. మ్యాచ్ జరిగిన ఐదు రోజుల్లోనే పిచ్ స్వభావం మారిపోయింది. ఇలా అయితే ఇరు జట్లు క్రీడాకారులు ఒకే రకమైన ప్రదర్శించడానికి వీలుండదు. అని వివరించింది. ఒకసారి బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చే మైదానం మరోసారి బౌలర్‌కి వస్తుంది. ఇలా జరగడం అస్సలేం బాగాలేదు.' అని విమర్శించింది.
వీరు ఈ నివేదికను పట్టించుకోకుంటే 2018 జనవరి 4 వతారీఖు జరగనున్న అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్ లో సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురుకానున్నాయి. వరుసగా ఐదు లోపాలను ఏదైనా మైదానంలో ఎత్తి చూపిస్తే దాన్ని ఏడాది కాలం పాటు నిషేదించాలి. అలా కాకుండా పది లోపాలున్నట్లయితే దాన్ని రెండు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉంచుతారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.