Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

8 వికెట్లతో స్టువర్ట్ బ్రాడ్ విజృంభణ.. లంచ్‌కు ముందే ఆస్ట్రేలియా ఆలౌట్

Ashes flashback: When Stuart Broad’s 8 for 15 bundled Australia out before lunch on Day 1

హైదరాబాద్: ప్రపంచకప్‌-2019 ఛాంపియన్ ఇంగ్లాండ్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆగస్టు 1 నుండి స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్‌లో తలపడనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు యాషెస్ 2019 సిరీస్‌తో ప్రారంభించనున్నాయి. ప్రపంచకప్‌ గెలిచి ఇంగ్లాండ్ మంచి ఊపులో ఉండగా.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులోకి తిరిగి రావడంతో ఆస్ట్రేలియా కూడా పటిష్టంగా కనిపిస్తోంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ఆస్ట్రేలియాపై ఒత్తిడి:

ఆస్ట్రేలియాపై ఒత్తిడి:

యాషెస్ చరిత్రలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు గొప్ప రికార్డులు కలిగి ఉంది. కానీ కంగారుల జట్టు 2001 నుండి ఇంగ్లీష్ గడ్డపై యాషెస్ గెలవలేదు. దీంతో ఈసారి సిరీస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. ఓసారి యాషెస్ ఫ్లాష్‌బ్యాక్ పరిశిలిస్తే.. ఇంగ్లాండ్‌లో జరిగిన 2015 యాషెస్ సిరీస్‌లో అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు మొదటి టెస్టును 169 పరుగుల తేడాతో గెలిచింది. మైఖేల్ క్లార్క్ సారథ్యం వహిస్తున్న ఆసీస్.. రెండో టెస్టు ఏకంగా 405 పరుగుల తేడాతో గెలిచింది. తర్వాత మూడో టెస్టు ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పడింది.

60 పరుగులకు ఆలౌట్:

60 పరుగులకు ఆలౌట్:

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తన పేస్ బౌలింగ్‌తో స్టువర్ట్ బ్రాడ్ వణికించాడు. బ్రాడ్ దాటికి ఒక్క ఆసీస్ బ్యాట్స్‌మన్‌ కూడా క్రీజులో నిలవలేకపోయారు. బ్రాడ్ 8 వికెట్లతో విజృంబించడంతో ఆసీస్ కేవలం 18.3 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రాడ్ 9.3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసాడు. బ్రాడ్ కెరీర్-బెస్ట్ గణాంకాలు నమోదు చేసాడు.

 బెన్ స్టోక్స్ మాయ:

బెన్ స్టోక్స్ మాయ:

అనంతరం ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 391 వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ 130 పరుగులు చేసాడు. 331 పరుగుల లోటుతో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు 113 పరుగులు చేయడంతో మంచి ఆరంభం లభించింది. ఈ సమయంలో బెన్ స్టోక్స్ 6 వికెట్లు తీయడంతో 253 పరుగులు చేసి ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ మరో యాషెస్ సిరీస్ గెలుచుకుంది. 9 వికెట్లు తీసిన బ్రాడ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.

Story first published: Tuesday, July 30, 2019, 16:03 [IST]
Other articles published on Jul 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+