For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ టెస్టు సిరిస్‌ ఫిక్సింగ్ బాగోతంపై ఎవరేమన్నారు?

By Nageshwara Rao
Ashes fixing row: Ex-players, officials react with disbelief

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం ప్రారంభమైన మూడో టెస్టుపై ఫిక్సింక్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ విచారణకు కూడా ఆదేశించింది. ఇరు దేశాలకు చెందిన బోర్డులు ఫిక్సింగ్‌ను క్రికెట్‌ నుంచి తరిమి కొట్టాలని విచారణకు పూర్తిగా సహకరిస్తాని ప్రకటనలు కూడా చేశాయి. తాజాగా ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆస్ట్రేలియాకు చెందిన పలువురు ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


మైక్ హస్సీ (ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు)
ప్రస్తుతం క్రికెటర్లు ఎంతో పరిణితితో ఉన్నారని... ఫిక్సింగ్‌కు పాల్పడితే ఆ తర్వాత సంభవించే పరిణామాలు వారికి పూర్తిగా తెలుసు. ఐసీసీ సైతం ఇటువంటి వాటిని ఎంత మాత్రం ఒప్పుకోదని, ఆటగాళ్లు దీనిని సీరియస్‌గా తీసుకుంటే మంచింది. ఫిక్సింగ్ ఆరోపణలు నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. నిజానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లకు ఆయా దేశాల బోర్డులు పెద్ద మొత్తంలో వేతనాలను చెల్లిస్తున్నాయి. కాబట్టి వారు ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశం ఉండదని అనుకుంటున్నా.


జెఫ్ లాసన్ (ఆస్ట్రేలియా మాజీ పేసర్)
బుకీలు స్పాట్ ఫిక్సింగ్‌పై మాట్లాడుకుంటున్న వీడియోని చూశాను. ఇదంతా ఏదో కల్పితంగా ఉందని అనుకుంటున్నా. వీడియోలో ఫిక్సింగ్ చేస్తే ఇచ్చే మనీ గురించి ఏదైతే వారు మాట్లాడారో అది కచ్చితంగా లేదు. టెస్టు క్రికెట్‌ను సెషన్ల వారీగా ఫిక్సింగ్ చేయలేం. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నిజానికి టెస్టు క్రికెట్‌ను ఫిక్సింగ్ చేయడం అంత సులభం కాదు.


గావిన్ రోబర్ట్‌సన్ (మాజీ ఆస్ట్రేలియా స్పిన్నర్)
యాషెస్ సిరిస్ ఫిక్స్ అయినట్లు వార్తలను నేను నమ్మను. ఎందుకంటే వీడియోలో సెషన్లను ఫిక్స్ చేస్తామంటూ మాట్లాడుకున్నారు. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదు. 14 నెలల క్రితం నేను అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాను. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ చర్చిస్తోంది.


ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)
యాషెస్ టెస్టు సిరిస్‌లో వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ యాంటి కరప్షన్ యూనిట్ విచారణకు దిగింది. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టం. ఈ ఫిక్సింగ్ ఆరోపణల గురించి విన్నాం. అయితే ఇందులో ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు సరైన ఆధారాలు లభించలేదు.


ఫిక్సింగ్ ఆరోపణలపై ట్విట్టర్ రియాక్షన్స్:

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 12:29 [IST]
Other articles published on Dec 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+