Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీలతో చెలరేగిన మార్ష్ సోదరులు: సిడ్నీ టెస్టులో విజయం దిశగా ఆసీస్

Ashes: England melt in Sydney heat as Marsh brothers and Lyon leave Australia poised

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా ఆస్ట్రేలియన్లు తమ హహాను కొనసాగిస్తున్నారు.

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా 2018 5వ టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు

నాలుగో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బారిస్టో (17), జో రూట్ (42) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ని 649/7 వద్ద డిక్లేర్ చేసింది.

ఓవర్‌ నైట్ స్కోరు 479/4తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌కు షాన్ మార్ష్ (156), మిచెల్ మార్ష్ (101)ల జోడి భారీ స్కోరు అందించారు. వరుసగా సెంచరీ సాధించిన ఈ అన్నదమ్ములు ఐదో వికెట్‌కి 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో 303 పరుగుల వెనుకంజలో ఉన్న ఇంగ్లాండ్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 7, 2018, 17:01 [IST]
Other articles published on Jan 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+