మ్యాచ్ మధ్యలో లవ్ ప్రపోజ్: స్టేడియంలోని స్మిమ్మింగ్ పూల్‌లో ముద్దులు
హైదరాబాద్: ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు బ్రిస్బేన్‌లోని చారిత్రాక గబ్బా స్టేడియంలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ ఆరంభానికి ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది.

ఆసక్తికరంగా యాషెస్ తొలి టెస్టు
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మా జట్టు గెలుస్తుందంటే, మా జట్టు గెలుస్తుందంటూ వాదోపవాదాలు, చర్చలు జరగడంతో ఈ సిరిస్ ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరిస్‌ను ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా దేశాలకు చెందిన అభిమానులు ఎంతగా ఎంతగా ఆరాధిస్తారో తెలిపేందుకు నిదర్శనమే ఈ సంఘటన.

స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసిన స్టేడియం నిర్వాహకులు
తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియంలో నిర్వహకులు ఈసారి వినూత్నంగా ఓవైపు స్టాండ్స్ తీసేసి.. స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో నుంచే మ్యాచ్ వీక్షించే అవకాశం కల్పించడంతో క్రికెట్ అభిమానులు ఎంత సంతోషానికి గురవుతున్నారు.

స్టేడియంలోనే రొమాన్స్ ఓ ప్రేమ జటం
తాజాగా ఓప్రేమికుల జంట యాషెస్ సిరిస్ జరుగుతున్న గబ్బా స్టేడియంను వారి ప్రేమకు అనకూలంగా మార్చుకుంది. అంతేనా స్టేడియంలోనే రొమాన్స్ చేసింది. తొలి టెస్టు రెండో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్‌లో లవ్ ప్రపోజల్
ఈ సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న తన ప్రేయసికి ఆమె ప్రియుడు లవ్ ప్రపోజ్ చేశాడు. అనంతరం ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటుండగా కెమెరాలు వాళ్ల వైపు తిరిగాయి. దీంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షుకులతో పాటు
కామెంటరీ బాక్స్‌లో ఉన్న వ్యాఖ్యాతలు సైతం ఈ దృశ్యంపై స్పందించారు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 302 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిస్ సమయానికి ఆస్ట్రేలియా 165/4 పరుగులు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications