ఆసీస్ వికెట్ కీపర్ టిమ్ పైనీ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడా?

హైదరాబాద్: యాషెస్ సిరీస్ లో అజేయంగా దూసుకుపోతూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద సమస్య వచ్చి పడింది. క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ ఎంత ప్రధాన పాత్ర వహిస్తాడో అందరికీ తెలిసిందే. దాదాపు అదే పొజిషన్‌లో ఫిక్స్ అయిపోయిన టిమ్ పైనీ నాలుగో టెస్ట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
టిమ్ పైనీ మామయ్య గుండెనొప్పితో బాధపడుతుండటంతో అతను అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. ఒక జట్టుగా ఏర్పడి పోరాడుతున్న ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు మరొక ఆటగాడిని వికెట్ కీపర్‌గా ఉంచుకోవాల్సి రావచ్చు. ఈ వార్త విన్న వెంటనే కుంగిపోయిన టిమ్ పైనీ ఇంటికి ప్రయాణం పట్టాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 'తన కుటుంబం ఈ కష్టం నుంచి బయటపడాలంటూ' ట్వీట్ చేసింది. తను కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications