For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్: పెర్త్ టెస్టుకు ఆసీస్ మార్పులు, జట్టులో మిచెల్ మార్ష్

By Nageshwara Rao
Ashes: Australia add Mitchell Marsh for Perth Test

హైదరాబాద్: పెర్త్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ప్రకటించిన జట్టులో మిచెల్ మార్ష్ చోటు దక్కించుకున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా తొలుత తొలి రెండు టెస్టులకు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ సెలక్టర్లు బుధవారం మూడో టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించారు.

ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా పెర్త్ టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఇందులో భాగంగా స్థానికుడైన మిచెల్ మార్ష్‌కు జట్టులో చోటు కల్పించింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ (126) సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మిచెల్ మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో 44.66 యావరేజితో 402 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 95 పరుగులు కూడా ఉన్నాయి. దీంతో ఆల్ రౌండర్ ఛాడీ సేయర్స్ స్థానంలో సెలక్టర్లు మిచెల్ మార్ష్‌కు చోటు కల్పించారు.

అంతేకాదు మిచెల్ స్టార్క్, జోష్ హెజెల్ ఉడ్, ప్యాట్ కుమ్మిన్స్‌కు బ్యాకప్‌గా ఉండాడని కూడా సెలక్టర్ల నమ్మకం. ఇదిలా ఉంటే ఆసీస్ జట్టు ఎంపికపై ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ ట్రెవర్ మాట్లాడుతూ తొలి రెండు టెస్టుల్లోఓటమి పాలైనా... పెర్త్‌లో ఫలితం ఇంగ్లాండ్‌‌కు అనుకూలంగా ఉంటుందని అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్క్రోఫ్ట్, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హాండ్స్‌కోంబ్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కుమ్మిన్స్, నాథన్ లియోన్, జోష్ హేజెల్ ఉడ్, జాక్సన్ బర్డ్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 13:45 [IST]
Other articles published on Dec 7, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+