For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన లయన్.. కుర్చీ మడతబెట్టిన మెక్‌గ్రాత్!(వీడియో)

ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ టెస్ట్ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో నాథన్ లయన్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాథన్ లయన్ ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నారు.

మెక్‌గ్రాత్‌ను దాటేసిన నాథన్ లయన్
గురువారం నాటి ఆటలో నాథన్ లయన్ రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా తన కెరీర్ టెస్ట్ వికెట్ల సంఖ్యను 564కి చేర్చుకున్నారు. తద్వారా 563 వికెట్లు తీసిన మెక్‌గ్రాత్‌ను వెనక్కి నెట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓలీ పోప్, బెన్ డకెట్‌లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ద్వారా నాథన్ లయన్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్(708) తర్వాత లయన్ రెండో స్థానంలో నిలిచారు.

Ashes 3rd Test Nathan Lyon Creates History Surpasses McGrath in Test Wickets

కుర్చీ విసిరేసినంత పని చేసిన మెక్‌గ్రాత్ !
నాథన్ లయన్ తన రికార్డును అధిగమించగానే కామెంటరీ బాక్సులో ఉన్న గ్లెన్ మెక్‌గ్రాత్ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన రికార్డు బ్రేక్ అయినందుకు సరదాగా కోపం నటిస్తూ.. అక్కడే ఉన్న ఒక కుర్చీని విసిరేయబోతున్నట్లు మెక్‌గ్రాత్ సైగ చేశాడు. ఆ తర్వాత వెంటనే నవ్వుతూ నాథన్ లయన్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

మ్యాచ్ అప్‌డేట్స్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ (106) సెంచరీతో మెరవగా.. మిచెల్ స్టార్క్ (54) అర్ధ సెంచరీతో రాణించారు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీయగా.. లయన్ వెంటనే రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్, హ్యారీ బ్రూక్ ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ పట్టు బిగిస్తోంది. వేడి వాతావరణం, పిచ్ పరిస్థితులు బౌలర్లకు సవాల్‌గా మారినప్పటికీ, లయన్ తన స్పిన్ మ్యాజిక్‌తో ఇంగ్లాండ్‌ను దెబ్బతీస్తున్నారు.

Story first published: Thursday, December 18, 2025, 10:53 [IST]
Other articles published on Dec 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+