For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ కొట్టకపోతే నగ్నంగా నడుస్తా: స్టార్ క్రికెటర్ హాట్ ఛాలెంజ్!

Ashes 2025: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లలో యాషెస్ ఒకటిగా నిలుస్తుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న యాషెస్ 2025 సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి యాషెస్ సిరీస్ నవంబర్ 21న ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఒక హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఈ యాషెస్ సిరీస్‌లో సెంచరీ చేయకపోతే, తాను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) చుట్టూ నగ్నంగా నడుస్తానని శపథం చేశారు.

హేడెన్ ఛాలెంజ్.. కూతురి విజ్ఞప్తి
ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ సెంచరీల కరువును తప్పకుండా తీరుస్తాడని హేడన్ గట్టిగా నమ్ముతున్నారు. హేడెన్ ఈ ప్రకటన సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. దీనిపై ఆయన కూతురు, స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన గ్రేస్ హేడన్ కూడా స్పందించింది. తన తండ్రిని ఈ పని చేయకుండా ఆపడానికి ఆమె ఒక సరదా అభ్యర్థన చేసింది. సోషల్ మీడియాలో ఆమె "ప్లీజ్ జో రూట్, ఒక సెంచరీ అయినా బాదు" అని విజ్ఞప్తి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Ashes 2025 Matthew Hayden s Naked Run Challenge to Joe Root Goes Viral

ఆస్ట్రేలియాలో జో రూట్ రికార్డు
జో రూట్‌ను టెస్ట్ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లలో ఒకరిగా పరిగణించినప్పటికీ.. ఆస్ట్రేలియాలో జో రూట్ రికార్డు ఆశించినంత గొప్పగా లేదు. ఆస్ట్రేలియాలో ఆడిన 14 టెస్ట్ మ్యాచ్‌లలో జో రూట్ 35.6 సగటుతో 892 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్థశతకాలు ఉన్నప్పటికీ, ఒక్క సెంచరీ కూడా లేదు. తన కెరీర్‌లో ఉన్న ఈ లోపాన్ని జో రూట్ ఈసారి తప్పకుండా సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు.

జో రూట్ టెస్ట్ కెరీర్
జో రూట్ ఇప్పటివరకు 134 టెస్ట్ మ్యాచ్‌లలో 13,543 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అతను రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. ఇంత గొప్ప గణాంకాలు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలో మాత్రం జో రూట్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

Story first published: Friday, September 12, 2025, 18:32 [IST]
Other articles published on Sep 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+