Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్క్ మాయాజాలం.. యాషెస్ ఆరంభంలోనే కష్టాల్లో ఇంగ్లండ్‌!

ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ ఆరంభంలోని ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేస్ సంచలనం మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చి ఆతిథ్య జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అనంతరం ముచ్చటగా మూడో వికెట్ పడగొట్టి ఇంగ్లండ్ జట్టును కష్టాల్లోకి నెట్టేశాడు. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

స్టార్క్ మాయాజాలం.. బెన్ డకెట్ కూడా ఔట్
గతంలో యాషెస్ సిరీస్ తొలి బంతికే వికెట్ తీసిన రికార్డు స్టార్క్‌కు ఉంది. ఈసారి తొలి బంతికి అది సాధ్యం కాకపోయినా, తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కించుకున్నాడు.తొలి ఓవర్‌లో మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని లక్ష్యంగా చేసుకుని, ఆఫ్ స్టంప్‌కు వరుసగా బంతులు విసిరాడు. గంటకు 143 కి.మీ. వేగంతో దూసుకొచ్చిన బంతిని క్రాలీ కవర్స్ వైపు డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా సునాయాసంగా క్యాచ్ అందుకోవడంతో క్రాలీ డకౌట్ అయ్యాడు.

Ashes 2025 Begins with a Big Shock for England Mitchell Starc Strikes Early with Triple Blow

తొలి ఓవర్‌లోనే క్రాలీ ఔటైన తర్వాత, మరో ఓపెనర్ బెన్ డకెట్‌(21)ను కూడా స్టార్కే త్వరగా పెవిలియన్‌కు పంపాడు. డకెట్ స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ విధంగా, మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చి, మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ఆస్ట్రేలియాకు మార్గం సుగమం చేశాడు.

ముచ్చటగా మూడో వికెట్.. జో రూట్ ఔట్
యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ జట్టును మిచెల్ స్టార్క్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తన పదునైన పేస్ ఆయుధంతో వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు. ఓపెనర్లతో పాటు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌(0)ను కూడా ఔట్ చేశాడు. జో రూట్ కూడా డకౌట్ కావడం గమనార్హం. స్టార్క్ వేసిన బంతి రూట్ బ్యాట్ కు తగిలి స్లిప్ లో ఉన్న లబుషేన్ చేతిలోకి వెళ్లింది. మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది.

ఐదు సిరీస్‌లలో ఇది మూడో డకౌట్
ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్‌కు యాషెస్ సిరీస్ ఆరంభం సరిగా లేకపోవడం చాలా కాలంగా కొనసాగుతోంది. గత ఐదు ఆస్ట్రేలియా పర్యటనల్లో, మూడుసార్లు ఇంగ్లండ్ తొలి వికెట్‌ను సున్నా పరుగుల వద్దే కోల్పోయింది.

గత 5 ఆస్ట్రేలియా పర్యటనల్లో ఇంగ్లండ్ ఆరంభం:
*0 - స్ట్రాస్, కుక్ - బ్రిస్బేన్ (2010/11)

*28 - కుక్, కార్బరీ - బ్రిస్బేన్ (2013/14)

*2 - కుక్, స్టోన్‌మన్ - బ్రిస్బేన్ (2017/18)

*0 - బర్న్స్, హమీద్ - బ్రిస్బేన్ (2021/22)

*0 - క్రాలీ, డకెట్ - పెర్త్ (2025/26)

2023లో క్రాలీ ఫోర్ కొట్టాడు
2021/22 యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ తొలి బంతికే వికెట్ తీశాడు. అయితే 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో జాక్ క్రాలీ మొదటి బంతికే ఫోర్ కొట్టి 'బేజ్‌బాల్' శైలిని ప్రదర్శించాడు. కానీ ఈసారి స్టార్క్ ముందు క్రాలీ ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయాడు.

Story first published: Friday, November 21, 2025, 8:56 [IST]
Other articles published on Nov 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+