Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: యాషెస్‌లో కూడా కోహ్లీనే హాట్ టాపిక్.. స్పిన్ ఆడాలంటే అతనే అంటున్న లెజెండ్స్..!

క్రికెట్ ఎక్కడ జరుగుతున్నా సరే సూపర్ స్టార్ ఆటగాళ్లను దాని నుంచి వేరు చేయలేం. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ కూడా అలాంటి వాడే. డబ్ల్యూటీసీ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లకు నెలరోజుల రెస్ట్ దొరికింది. దీంతో అతను తన ఖాళీ టైంను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో క్రికెట్‌లో ఓల్డెస్ట్ రైవలరీ యాషెస్ మొదలైంది.

ఈ సిరీస్‌లో కూడా కోహ్లీ ప్రస్తావన వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన కెరీర్‌లో తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు 130 టెస్టులు ఆడిన రూట్ ఒక్కసారి కూడా స్టంప్ అవుట్ అవ్వలేదు. కానీ ఈ మ్యాచ్ నాలుగో రోజున నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్.. కోహ్లీని కూడా ప్రస్తావించాడు.

Ashes 2023 Virat Kohli became hot topic after Joe Root dismissal

ఇలా స్టంప్ అవుట్ అవడం రూట్ కెరీర్‌లో ఇదే తొలిసారి. అలాగే కొన్ని నెలల క్రితం జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ కూడా తన టెస్టు కెరీర్‌లో తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో అతన్ని కూడా అలెక్స్ క్యారీనే స్టంప్ అవుట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న పీటర్సన్.. కోహ్లీ స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడని మెచ్చుకున్నాడు.

'స్పిన్‌ను విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు. బ్యాక్ ఫుట్‌లో స్పిన్‌ను ఆడటంతోపాటు చాలా అందమైన మణికట్టు మూవ్‌మెంట్ ఉంటుంది. కోహ్లీ క్రీజు వదిలి ముందుకు దూకడం చాలా రేర్‌గా చూస్తాం. అలాగే అతను స్వీప్, రివర్స్ స్వీప్ కూడా ఆడడు. అతను ఆడటాన్ని మనం ఈజీగా ఊహించుకోవచ్చు. అతను మానసికంగా ఆడటాన్ని కూడా చూడొచ్చు. దీంతో మనకు అది అర్థం అయిపోతుంది' అని పీటర్సన్ అన్నాడు.

శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. 'కోహ్లీ ఐపీఎల్‌ మోడ్‌లో ఉన్నట్లు కూడా కనిపిస్తాడు. ఇప్పుడు ఆడే చాలా మంది ఆటగాళ్లు క్రీజులో నుంచి ముందుకు దూకి ఆడతారు. ఇలా లెంగ్త్ బాల్స్ వేయకుండా అడ్డుకుంటారు. ఈ క్రమంలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే ఫుట్ వర్క్ వాడటం పూర్తిగా పోయింది. ముందుకు దూకి సింగిల్ తీయడం అలవాటైపోయింది. కానీ క్రీజులోనే ఉండి సిక్సర్ కొట్టడం మర్చిపోయారు' అని సంగక్కర చెప్పాడు.

Story first published: Tuesday, June 20, 2023, 10:04 [IST]
Other articles published on Jun 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+