Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోడర్న్ క్రికెట్‌లో బెస్ట్ టెస్ట్ బ్యాటర్.. ఆసీస్ స్టార్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్!

రెండో యాషెస్ టెస్టుకు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆరంబం అందించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు కొత్త పేసర్ జోష్ టంగ్ మంచి ఆరంభం అందించాడు. ప్రమాదకరమైన ఉస్మాన్ ఖవాజా (17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్ వార్నర్ (66)ను కూడా అతను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ పైచేయి సాధించినట్లే కనిపించింది.

కానీ ఆసీస్ స్టార్లు మార్నస్ లబుషేన్ (47), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. ఆ తర్వాత లబుషేన్ అవుటైనా.. మంచి ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ (77)తో కూడా స్మిత్ కీలకమైన పార్టనర్‌షిప్ జోడించాడు. హెడ్ వేగంగా ఆడుతుంటే అతనికి మంచి సహకారం అందించాడు.

Ashes 2023 Steve Smith showcases his class in second test

వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. అదే జోరు కొనసాగించే క్రమంలో ట్రావిస్ హెడ్ అవుటైనా.. స్మిత్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో ఆసీస్ యువ సంచలనం కామెరూన్ గ్రీన్ (0) డకౌట్ అవగా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (11 నాటౌట్)తో కలిసి స్టీవ్ స్మిత్ పోరాడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆీస్ 339/5 స్కోరుతో నిలిచింది.

ఆట ముగిసే సమయానికి స్మిత్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వేగంగా 9 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా కూడా అతను రికార్డు సృష్టించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఫ్యాబ్ ఫోర్‌లో స్మిత్ బెస్ట్ అని, అతను కనుక 2018లో బ్యాన్ ఎదుర్కోక పోయి ఉంటే ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేవాడని అంటున్నారు. మోడర్న్ ఎరాలో బెస్ట్ టెస్టు బ్యాటర్ అతనే అంటున్నారు.

Story first published: Thursday, June 29, 2023, 9:25 [IST]
Other articles published on Jun 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+