Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: సన్‌రైజర్స్ స్టార్ సూపర్ ఇన్నింగ్స్.. మూడో టెస్టులో ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!

యాషెస్ సిరీసులో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. హెడింగ్లే వేదికగా జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యార్ హ్యారీ బ్రూక్ (75) ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లు అంతా తేలిపోయినా.. అతనొక్కడే అద్భుతంగా ఆడుతూ.. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ను కేవలం 263 పరుగులకే ఆలౌట్ చేయగలిగింది. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా తేలిపోయారు. జాక్ క్రాలీ (33) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80) ఒక్కడే రాణించాడు. మిగతా వాళ్లంతా దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో ఆ టీం 237 పరుగులకు ఆలౌట్ అయింది.

Ashes 2023 SRH star Harry Brook fighting knock gets first victory for England

ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. కేవలం 90 పరుగుల వ్యవధిలోనే ఆరుగురు ఆసీస్ బ్యాటర్లను అవుట్ చేశారు. బ్రాడ్, క్రిస్ వోక్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ (77) ఒక్కడే రాణించాడు. దీంతో ఆ జట్టు 224 పరుగులు చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్ నిలిచింది.

నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ బ్యాటింగ్ మరోసారి తడబడింది. జాక్ క్రాలీ (44), బెన్ డకెట్ (23) ఫర్వాలేదనిపించారు. మూడో స్థానంలో వచ్చిన మొయీన్ అలీ (5), జోరూట్ (21) పెద్దగా ఆకట్టుకోలేదు. కెప్టెన్ స్టోక్స్ (13) కూడా ఫెయిలయ్యాడు. బెయిర్‌స్టో (5) కూడా విఫలమయ్యాడు. ఇలా ఒక పక్క వికెట్లు పడుతున్నా హ్యారీ బ్రూక్ (75) మాత్రం ధైర్యంగా ఆడాడు.

తను డిఫెన్స్‌లో పడితే పరిస్థితి చేజారి పోతుందని అర్థం చేసుకున్న అతను.. ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. అతన్ని స్టార్క్ అవుట్ చేసినా చివర్లో క్రిస్ వోక్స్ (32 నాటౌట్), మార్క్ వుడ్ (16 నాటౌట్) ఇద్దరూ కలిసి లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు.

Story first published: Sunday, July 9, 2023, 20:31 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+