Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఒక్కడి మీదే ఆధారపడితే ఎలా గెలుస్తారు?.. ఇంగ్లండ్‌పై అలీ విమర్శలు!

యాషెస్ సిరీసులో వరుసగా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లండ్ జట్టు.. మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆ టీం బ్యాటర్లు మాత్రం అంత గొప్పగా రాణించడం లేదు. మూడో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు రాణించడంతో ఆసీస్ జట్టు కేవలం 263 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ ఇంగ్లిష్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో ఆ టీం మంచి స్కోరు చేయలేకపోయింది.

ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బంతితో చెలరేగాడు. అతను ఏకంగా ఆరు వికెట్లతో రాణించడంతో ఇంగ్లండ్ కేవలం 237 పరుగులకే చాపచుట్టేసింది. కేవలం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రమే 80 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో జాక్ క్రాలీ (33) మినహా ఎవరూ కనీసం 25 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇంత ఘోరంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

England All-rounder Moeen Ali says their team is over-reliant on Ben Stokes

అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు కూడా తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కేవలం 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్ నిలిచింది. మూడో రోజు ఆట చాలా వరకు వర్షం వల్ల జరగలేదు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్లేమీ కోల్పోకుండా 27 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు అందరూ రాణించాల్సిన అవసరం ఉందని ఆల్‌రౌండర్ మొయీన్ అలీ అన్నాడు.

తొలి మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 155 పరుగులతో స్టోక్స్ చెలరేగాడు. అతనొక్కడే ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు పోరాడాడు. ఇక మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కూడా 80 పరుగులతో స్టోక్స్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మొయీన్ అలీ మాట్లాడుతూ.. 'ఇంగ్లండ్ టీం మరీ ఎక్కువగా స్టోక్స్‌పై ఆధారపడుతోంది. అతను అద్భుతమైన ప్లేయర్. కానీ మరీ అంతలా ఆధార పడకూడదు' అన్నాడు.

'వైట్ బాల్, రెడ్ బాల్ ఏ క్రికెట్ అయినా స్టోక్స్ సూపర్ ప్లేయరే. అతను క్రీజులో ఉన్నంత వరకు గెలిచేందుకు చాలా అవకాశం ఉంటుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం స్టోక్స్‌కు ఇష్టం. వాటిలో అతను అద్భుతంగా రాణిస్తాడు. అందుకని కేవలం స్టోక్స్‌పైనే ఆధార పడటం కరెక్ట్ కాదు. మా టీంలో చాలా మంది ప్రమాదకర ప్లేయర్లు ఉన్నారు. వాళ్లు కూడా బెన్ లాగే రాణించాలి' అని అలీ పేర్కొన్నాడు.

Story first published: Sunday, July 9, 2023, 11:19 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+