Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఏం క్యాచ్ పట్టావ్ బాసూ.. లబుషేన్‌ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆసీస్ జట్టు తమ ఏ-గేమ్ ఆడుతోంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లతోపాటు ఫీల్డర్లు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు దాటలేకపోయారు. కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే 40+ స్కోరు చేశారు.

ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (46) చక్కగా రాణించాడు. కానీ ఇంగ్లండ్ కొత్త విధానం బాజ్‌బాల్‌ ఆడుతూ భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ ధనాధన్ షాట్లతో అదరగొట్టాడు. అతను 52 బంతుల్లోనే ఐదు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా 37 బంతుల్లో 32 పరుగులతో అతను ఫర్వాలేదనిపించాడు.

Australia star Marnus Labushagne

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ లియాన్ బౌలింగ్‌లో తడబడ్డాడు. హాఫ్ సెంచరీ త్వరగా పూర్తి చేసుకోవాలనే తొందరలో లెగ్ సైడ్ బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్నస్ లబుషేన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో బ్రూక్‌ను అవుట్ చేశాడు.

తన కుడివైపుగా బంతి దూసుకెళ్లడం చూసిన లబుషేన్.. బాణంలా దానిపైకి దూకాడు. ఈ క్రమంలో బంతి గాల్లో ఉండగానే క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ షాకైపోతున్నారు. లబుషేన్ ఫీల్డింగ్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు. అసలు ఈ క్యాచ్ ఎలా పట్టాడో అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

అనంతరం ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్ (43) ఒక్కడే 40 పరుగుల మార్కు దాటాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ ముందు 280 పరుగుల టార్గెట్ నిలిపింది. కంగారూ బౌలర్లలో నాథన్ లియాన్, ప్యాట్ కమిన్స్ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అనుకున్న స్కోరు చేయలేకపోయారు.

Story first published: Monday, June 19, 2023, 22:32 [IST]
Other articles published on Jun 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+