యాషెస్ సిరీస్‌ను బెయిర్‌స్టో రనౌట్ బాగా వేడెక్కించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజాలు కూడా తమ తమ జట్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ఆయా దేశ ప్రధానులు కూడా తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చారు. ఈ విషయంలో ఇంగ్లిష్ మీడియా అంతా కలిసి బెయిర్‌స్టోను అన్యాయంగా అవుట్ చేశారని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెగ గొడవ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వివాదంపై లెజెండరీ అంపైర్ సైమన్ టాఫెల్ స్పందించాడు. ఈ అవుట్‌లో తప్పు ఎవరిది? అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఆస్ట్రేలియా ఎలాంటి తప్పు చేయలేదని, అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ స్వీకరించాలని తేల్చిచెప్పాడు. 'ఈ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇంగ్లండ్‌కు అది నచ్చలేదు. అందుకే ఈ గొడవ. రెండు టీమ్స్ బంతిని వేదిలేసే వరకు బంతి డెడ్ కాదు' అని క్లియర్‌గా చెప్పేశాడీ మాజీ అంపైర్.

'ఓవర్ పూర్తయింది అనుకోవాలన్నా.. బంతి డెడ్ అనుకోవాలన్నా.. ఎప్పుడైనా రెండు జట్లు బంతిని వదిలేయాలి. అప్పుడే బంతి డెడ్ అవుతుంది. ఈ ఘటనలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు.. బంతిని ఇంకా వదిలేయలేదు' అని సైమన్ టాఫెల్ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ గొడవతో యాషెస్ సిరీస్‌లో హీట్ పెరిగింది. ఇప్పటికే ఇంగ్లండ్ 0-2తో వెనుకపడి ఉంది. అయితే ఈ ఘటన కారణంగా మూడో టెస్టులో ఇంగ్లండ్ మరింత పట్టుదలగా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఘటన వల్ల రెండు జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఇక కుదరదని, ఇది కచ్చితంగా క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకమేనని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచేందుకు ఇంగ్లండ్ తమ టీంలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సయమంలో నాథన్ లియాన్ లేకుండా ఆసీస్ బరిలో దిగడం ఇంగ్లండ్‌కు బాగా కలిసొచ్చే అంశంగా కనపడుతోంది.