ఈసారి యాషెస్ సిరీస్ అత్యంత థ్రిల్లింగ్‌గా సాగింది. తొలి రెండు మ్యాచుల్లో పట్టుదలగా ఆడి విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా.. చివరి మూడు మ్యాచుల్లో తడబడింది. ఇలాంటి సమయంలో మూడో టెస్టులో ఆసీస్‌కు వరుణుడు సాయం అందించాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఇంగ్లండ్ బాజ్‌బాల్ ముందు ఇంగ్లండ్ నిలవలేకపోయింది. దీంతో ఆసీస్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. అయినా సరే మొదటి రెండు మ్యాచులు గెలవడంతో ఈ సిరీసును 2-2తో డ్రా చేసుకున్నాయీ జట్లు. ఈ క్రమంలో గత యాషెస్ గెలిచిన ఆసీస్ తమ ట్రోఫీని రిటైన్ చేసుకుంది.

ఇంత థ్రిల్లింగ్‌గా మ్యాచులు సాగినా కూడా.. ఈ సిరీసులో రెండు జట్లు ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంలో విఫలమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ రెండు జట్లపై సీరియస్ అయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఈ టీమ్స్ సాధించిన పాయింట్లపై వేటు వేసింది. ఆసీస్‌కు ఒక్క మ్యాచ్‌లో లో ఓవర్ రేటింగ్ కారణంగా పది పాయింట్లు కోత విధించింది.
అదే సమయంలో ఇంగ్లండ్‌కు ఈ సిరీసు మొత్తం కలిపి మొత్తం 19 పాయింట్లు కోత వేసింది. దీంతో ఈ రెండు టీమ్స్ ఉత్కంఠ భరితంగా సిరీస్ ఆడినా కూడా.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో రెండు టీమ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. ఇలా పాయింట్లు కోత వేయడంపై లెజెండరీ క్రికెటర్లు రికీ పాంటింగ్, నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు దీనికి బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ప్లేయర్లు మరీ ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటే.. అంపైర్లు కలగజేసుకోవాలని పాంటింగ్ అన్నాడు. మ్యాచ్‌లో ఈ టైం అంతా ఎక్కడకు వెళ్తుందో తెలియడం లేదన్నాడు. ప్రతిరోజూ అరగంట ఎక్స్‌ట్రా ఆడుతున్నా టైం ఎలా వేస్ట్ అవుతుందని ప్రశ్నించాడు. దీనిపై నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఇలా టైం వేస్ట్ చేస్తే వేసే శిక్ష ఇంకా కఠినంగా ఉండాలని అన్నాడు.