Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఇండియాకేనా ఆ రూల్?.. ఆసీసీ టీంను ట్రోల్ చేసిన గౌతం గంభీర్

ఆసీస్‌తో జరిగిన రెండో యాషెస్ టెస్టులో కూడా ఇంగ్లండ్ ఓడింది. భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. అయితే ఇంగ్లండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న అతను దాన్ని వదిలేశాడు. అనంతరం క్రీజులో కాలుతో మార్క్ కూడా చేసి ముందుకు వచ్చాడు.

ఆ సమయంలో అతనేమీ పరుగు తీయడానికి ప్రయత్నించలేదు. ఓవర్ పూర్తవడంతో సాధారణంగా అవతలి ఎండ్‌లోని బ్యాటర్‌తో కొన్ని రూల్స్ గురించి మాట్లాడటం క్రికెట్‌లో అలవాటే. అలా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడే బెయిర్‌స్టోను కీపర్ అవుట్ చేశారు. కీపర్ ఇలా అతన్ని అవుట్ చేయడంపై చాలా మంది మండిపడ్డారు. ఫ్యాన్స్ కూడా ఆసీస్ టీంను 'బూ..' కొడుతూ విమర్శించారు. ఆసీస్ ఎప్పుడూ ఇలాగే చీటింగ్ చేస్తుందంటూ తిట్టిపోశారు.

 Ashes 2023 Gautam Gambhir trolls Australia team after their second victory

ఆసీస్ దిగ్గజం బ్రాడ్ హాగ్ కూడా ఇది నాటౌట్ అని, ఓవర్ల మధ్యలో బ్యాటర్లు ఇలాగే చేస్తారని, బెయిర్‌స్టో కూడా అదే చేశాడని అన్నాడు. ఈ క్రమంలో బెయిర్‌స్టో అవుట్ కాదని తేల్చిచెప్పాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం దీన్ని అంత ఈజీగా తీసుకోలేదు. ఆసీస్ టీంను తెగ తిడుతున్నారు. తాజాగా టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ కూడా దీనిపై స్పందించాడు. ఆసీస్‌ను ట్రోల్ చేశాడు.

'హే స్లెడ్జర్స్.. మీ క్రీడాస్ఫూర్తి అనే లాజిక్ మీకు అప్లై అవదా? కేవలం ఇండియాకేనా?' అని ట్వీట్ చేశాడు. అలెక్స్ క్యారీ చేసిన పని కచ్చితంగా క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బెయిర్‌స్టో రియాక్షన్ చూస్తేనే ఆ అవుట్ ఎంత షాకింగ్‌గా ఉందో అర్థం అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Monday, July 3, 2023, 8:30 [IST]
Other articles published on Jul 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+