Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: మీరు చేస్తే కరెక్ట్.. వేరే వాళ్లు చేస్తే తప్పా?.. ఇంగ్లండ్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-2తో వెనుకబడింది. రెండో టెస్టులో కూడా వారి బాజ్‌బాల్ విధానం తేలిపోయింది. ఆసీస్ జోరు ముందు ఇంగ్లండ్ జట్టు విఫలమైంది. అయితే ఇలా ఆసీస్ వరుసగా రెండు మ్యాచులు గెలవడం కన్నా కూడా.. రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో అవుటైన విధానమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో మరో వీడియో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతుండగా.. బెయిర్‌స్టో అవుటయ్యాడు. కామెరూన్ గ్రీన్ వేసిన షార్ట్ బాల్‌ను ముందుకు వంగి వదిలేశాడతను. ఆ బంతి కీపర్ వైపు వెళ్లగానే.. క్రీజులో మార్క్ చేసి అవతలి ఎండ్‌లో ఉన్న స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆసీస్ కెప్టెన్ అలెక్స్ క్యారీ.. తన చేతిలోని బంతిని వికెట్ల మీదకు విసిరాడు.

Jonny Bairstow

అది వికెట్లను కూల్చడంతో ఆసీస్ టీం అంతా రనౌట్‌కు అప్పీల్ చేసింది. దాన్ని స్టంపౌట్‌గా అంపైర్ డిసైడ్ చేశాడు. అయితే ఇది చూసిన ఇంగ్లండ్ ఫ్యాన్స్ అందరూ ఆసీస్ టీంను తిట్టిపోశారు. వాళ్లను చీటర్లు అంటూ తెగ విమర్శించారు. ఇలాంటి చేష్టలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ ఇంగ్లండ్ మాజీలు కూడా మండిపడ్డారు. సరిగ్గా మూడ్రోజుల ముందు ఇంగ్లండ్ కూడా ఇలాంటి పనే చేసింది.

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 31వ ఓవర్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. కంగారూ స్టార్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇంగ్లిష్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ చేశాడు. అతని డెలివరీని మార్నస్ వదిలేశాడు. దాన్ని అందుకున్న కీపర్ బెయిర్‌స్టో వెంటనే బంతిని వికెట్ల వైపు విసిరాడు. అయితే అది వికెట్లకు తగల్లేదు. అలాగే లబుషేన్ కూడా క్రీజులో నుంచి కదల్లేదు. కాబట్టి ఎవరూ దీని గురించి ప్రశ్నించలేదు.

అదే పని ఆసీస్ ప్లేయర్లు చేసి సక్సెస్ అవగానే.. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా ఈ అవుట్‌ను తప్పుపట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాము చేస్తే కరెక్ట్, ఇతరులు చేస్తే తప్పు అనడం ఇంగ్లండ్‌కు అలవాటేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంతా తాము చెప్పినట్లే జరగాలని ఇంగ్లండ్ అనుకుంటోందని, అలా జరగదని హితబోధ చేస్తున్నారు.

Story first published: Monday, July 3, 2023, 18:44 [IST]
Other articles published on Jul 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+