Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఇంత ఫన్నీ క్యాచ్ ఎప్పుడూ చూడలేదు.. బంతికి ముద్దులు పెట్టడం ఏంటి?

యాషెస్ మూడో టెస్టులో ఒక ఫన్నీ ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఈ టీం బౌలింగ్ విభాగం అంతా రాణించడంతో ఈ నిర్ణయం సరైందే అని తేలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా కేవలం 263 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు వచ్చింది.

ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేసే బాధ్యతను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన భుజాలపై వేసుకున్నాడు. ఆసీస్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టులో రాణించిన యువ ఓపెనర్ బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు. కమిన్స్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు డకెట్ ప్రయత్నించాడు. కానీ దాన్ని అతను సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది.

 Ashes 2023 Fans cant stop laughing after Alex Carey takes a catch

ఈ క్యాచ్ అందుకోవడం కోసం అద్భుతంగా డైవ్ చేసిన అలెక్స్ క్యారీ.. వట్టి చేతులతో దాన్ని అందుకోలేనని అనుకున్నాడు. ఈ క్రమంలో తన మొఖాన్ని కూడా వాడుకున్నాడు. నోటితో బంతి చేజారకుండా అడ్డుకున్నాడు. ఆ సమయంలో కామెంటరీ చెప్తున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఇది చూసి నవ్వేశాడు. 'అది కచ్చితంగా ముద్దే.. అలెక్స్ క్యారీ, స్టేడియంలో పద్ధతిగా ఉండు' అంటూ జోక్ చేశాడు. అది విన్న తోటి కామెంటేటర్లు తెగ నవ్వేశారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. 'ఇలా స్టేడియంలో ముద్దులు పెట్టేస్తే ఎలా క్యారీ?' అని అడుగుతున్నారు. మరికొందరేమో తాము ఇప్పటి వరకు ఇంత ఫన్నీ క్యాచ్ చూడలేదంటున్నారు. ఏదేమైనా క్యారీ ఈ క్యాచ్ పూర్తి చేయడంతో బెన్ డకెట్ కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్లు కూడా చెలరేగుతుండటంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తిగా మారింది.

Story first published: Friday, July 7, 2023, 17:38 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+