Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్.. స్టోక్స్ ఫీట్‌కు ఫ్యాన్స్ ఫిదా! (వీడియో)

యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. ఐదో టెస్టు రెండో రోజునే ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ధనాధన్ ఆటతో 54.4 ఓవర్లలో 283 పరుగులు చేసింది. ఈ క్రమంలో తొలి రోజే ఆలౌట్ కూడా అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు.

ప్రత్యర్థి బౌలర్లకు ఆసీస్ బ్యాటర్లు సమాధానం ఇవ్వలేకపోయారు. స్టీవ్ స్మిత్ (71), ఉస్మాన్ ఖవాజా (47), ప్యాట్ కమిన్స్ (36), టాడ్ మర్ఫీ (34) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించి, ఆసీస్‌ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆలౌట్ చేశారు.

Ben Stokes took a stunning catch

అప్పటికి కంగారూలు కేవలం 295 పరుగులు మాత్రమే చేయగలిగారు. అంటే ఇంగ్లండ్‌పై వారి ఆధిక్యం కేవలం 12 పరుగులే అన్నమాట. ఈ మ్యాచ్‌లో చివరగా అవుటైన ఆసీస్ ప్లేయర్ ఆ టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతన్ని పెవిలియన్ చేర్చడానికి ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

జో రూట్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టేందుకు కమిన్స్ ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ దీన్ని క్యాచ్ పట్టేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి వేగానికి వెనకడుగు వేయాల్సి వచ్చింది. దీంతో తను బౌండరీ లైన్ దాటాల్సి వస్తుందని అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలోనే మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించాడు.

బౌండరీ లైన్ దాటేసే ముందే బంతిని స్టోక్స్ గాల్లోకి విసిరేశాడు. మళ్లీ తిరిగి మైదానంలోకి వచ్చేసి క్యాచ్ పూర్తి చేశాడు. ఈ క్యాచ్ అందుకోవడం చూసిన ప్రేక్షకులు సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ కనుక ఇంగ్లండ్ గెలిస్తే.. సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఇప్పటికే యాషెస్ ట్రోఫీ కోల్పోయిన ఇంగ్లండ్.. ఇలాగైనా కొంత పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

Story first published: Saturday, July 29, 2023, 14:14 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+