Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: స్టేడియంలో రచ్చ చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. ఆసీస్ కీపర్ క్రీజులోకి రాగానే..!

యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ ప్లేయర్లపై మరోసారి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్‌కు బాగా కలిసొచ్చింది. ఆసీస్ బ్యాటర్లను ఇంగ్లండ్ బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు.

ఈ క్రమంలో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇంగ్లండ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అతను మైదానంలోకి వస్తుంటే అందరూ కలిసి 'బూ..' అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్యారీ క్రీజులోకి రాగానే పెద్దగా.. 'క్యారీ అంటే కోపం ఉంటే.. షూస్ తీసేయండి' అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Ashes 2023 Fans Boo Alex Carey when he enters crease to play

మరో వీడియోలో 'క్యారీ అంటే కోపం ఉంటే.. నిలబడండి' అంటూ నినాదాలు చేశారు. చాలా మంది అలాగే నిలబడి మ్యాచ్ చూశారు. ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్‌స్టోను అలెక్స్ క్యారీ స్టంప్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రీన్ వేసిన షార్ట్ బాల్‌ను కిందకు వంగి బెయిర్‌స్టో తప్పించుకున్నాడు.

ఆ తర్వాత బంతి డెడ్ అనుకొని క్రీజులో మార్క్ చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. సరిగ్గా బంతి తన చేతుల్లోకి రాగానే దీన్ని గమనించిన క్యారీ.. వెంటనే త్రో వేసి వికెట్లను కూల్చాడు. థర్డ్ అంపైర్ కూడా దీన్ని అవుట్‌ ఇవ్వడంతో బెయిర్‌స్టోతోపాటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఈ ఘటనపై 'స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్' అంటూ తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్యారీపై ఇంగ్లండ్ అభిమానులు ఇలా నిరసన వ్యక్తం చేశారు.

Story first published: Friday, July 7, 2023, 16:10 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+