Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎగ్రెషన్ తర్వాత ముందు షూస్ సరిగా వేసుకో.. స్టార్‌పై ఫ్యాన్స్ జోకులు!

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో బాగా చర్చనీయాంశంగా మారిన అంశం ఖవాజాకు ఓలీ రాబిన్సన్ ఇచ్చిన సెండాఫ్. సెంచరీ చేసి జోరు మీదున్న ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేసిన రాబిన్సన్ పెద్దగా అరుస్తూ అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చి సెండాఫ్ ఇచ్చాడు. ఇది కొంచెం ఓవరాక్షన్‌లా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాబిన్సన్ గురించి మరో విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ తరఫున ప్రధాన పేసర్లలో రాబిన్సన్ ఒకడు. అయితే అతను ఈ టెస్టులో తన షూస్ సరిగా వేసుకు రాలేదు. కుడి కాలికి ఒక రకం, ఎడమ కాలికి ఒక రకం షూ వేసుకొని మైదానంలో దిగాడు. ఇది చూసిన నెటిజన్లు అతనిపై తెగ జోకులు పేలుస్తున్నారు. 'నీ ఎగ్రెషన్ తర్వాత బాసూ.. ముందు సరైన షూస్ వేసుకో' అంటూ నీతులు చెప్తున్నారు.

Ashes 2023 England pacer wears two different shoes and fans make fun of it

అయితే ఇలా రాబిన్సన్ వేరే వేరే షూస్ వేసుకోవడం వెనుక వేరే కారణం ఉందేమో అనే వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే యాషెస్ ఆడటానికి ముందు రాబిన్సన్ కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాబిన్సన్ గాయపడ్డాడు. ఎడమ కాలి మడమ దగ్గర నొప్పి రావడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కోలుకొని యాషెస్‌కు రెడీ అయ్యాడు.

ఈ క్రమంలో అతనికి ఇంకా ఈ నొప్పి తగ్గలేదని, అందుకే ఇలా వేరు వేరు రకాల షూస్ వేసుకొని వచ్చాడని కొందరు చెప్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 107/3 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు విజయానికి ఇంకా 174 పరుగులు అవసరం ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే ఏడు వికెట్లు కావాలి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Story first published: Tuesday, June 20, 2023, 9:46 [IST]
Other articles published on Jun 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+