Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఇక ఈ మ్యాచ్ ఆసీస్ ఓడిపోయినట్లే!

యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు. ఒకరి తర్వాత ఒకరే భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు.

బెన్ డకెట్ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే మరో ఓపెనర్ జాక్ క్రాలీ (189) ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. అతని అండతో మొయీన్ అలీ (54), జో రూట్ (84) కూడా రాణించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (51), హ్యారీ బ్రూక్ (61) కూడా ధాటిగా ఆడారు. ఇక చివర్లో టెయిలెండర్ల సాయంతో జానీ బెయిర్‌స్టో (99 నాటౌట్) విశ్వరూపమే చూపించాడు.

England batters smash Aussie pace attack on all parts of the ground

ఎడాపెడా బౌండరీలు బాదేసిన అతను ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతన్ని అవుట్ చేయడం ఆసీస్ వల్ల కాలేదు. ఎంతమంది బౌలర్లను మార్చినా, ఫీల్డింగ్ సెట్ చేసినా బెయిర్‌స్టో దూకుడుకు మాత్రం కళ్లెం వేయలేకపోయారు కంగారూలు. అయితే చివర్లో జేమ్స్ ఆండర్సన్ (5)ను గ్రీన్ అవుట్ చేయడంతో.. బెయిర్‌స్టో సెంచరీ పూర్తిచేయలేకపోయాడు. శతకానికి ఒక్క పరుగు తేడాలో అవతలి ఎండ్‌లో మిగిలిపోయాడు.

ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతనితోపాటు కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు ధాటిగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 592 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌పై 275 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీన్ని అధిగమించి ఈ మ్యాచ్ గెలవడం ఆసీస్ వల్ల అయ్యే పని కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, July 21, 2023, 19:49 [IST]
Other articles published on Jul 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+