Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: స్మిత్ తల్లిని వేధించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. సెక్యూరిటీ పెంచాలని ఆసీస్ డిమాండ్!

యాషెస్ సిరీస్ బాగా వేడెక్కింది. బెయిర్‌స్టో స్టంప్ అవుట్‌తో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వైరం మరో స్థాయికి చేరింది. దీనిలో ఫ్యాన్స్‌ కూడా కలగజేసుకుంటున్నారు. ముఖ్యంగా రెండో టెస్టు జరిగిన లార్డ్స్‌ మైదానంలో లాంగ్ రూంలో జరిగిన గొడవ పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో మూడో టెస్టులో మరింత కట్టుదిట్టమైన భద్రత కావాలంటూ ఆసీస్ ప్లేయర్లు డిమాండ్ చేస్తున్నారు.

బెయిర్‌స్టో అవుటైన తర్వాత స్టేడియంలో కూర్చొని ఉన్న ఇంగ్లండ్ అభిమానులంతా ఆస్ట్రేలియా టీంను 'చీటర్స్' అంటూ తెగ గొడవ చేసింది. ఇక లాంగ్ రూంలో అయితే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా భుజం పట్టుకొని లాగేశారు కూడా. దీంతో ప్లేయర్లు కూడా చాలా కోప్పడ్డారు. బెయిర్‌స్టో అలా అవుటవడం నచ్చని ఇంగ్లండ్ అభిమానులు.. ఆసీస్ జట్టు తమ అప్పీల్ వెనక్కు తీసుకోవాల్సిందని అంటున్నారు.

Steve Smith

క్రికెట్ నిబంధనల ప్రకారం అయితే బెయిర్‌స్టోను అవుట్ చేయడంలో ఆసీస్ ఎలాంటి తప్పు చెయ్యలేదు. కానీ ఈ ఘటన వల్ల రెండు జట్ల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ క్రమంలో హెడింగ్లేలో మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు కచ్చితంగా ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హెడింగ్లేలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆసీస్ జట్టు కోరినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఇంగ్లండ్ అభిమానులు అతి చేష్టలే.

లార్డ్స్‌లో ఐదో రోజు ఆటలో వాళ్లు చేసిన పనికి ఒక స్టాఫ్ మెంబర్ 11 ఏళ్ల పిల్లాడు ఏడ్చేశాడు. ఒక ఆసీస్ ప్లేయర్ తల్లిని ఇంగ్లండ్ ఫ్యాన్స్ అంతా కలిసి గోల గోల చేసి స్టేడియం నుంచి బయటకు పంపేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొన్న ఆసీస్ టీం.. తమకు హెడింగ్లేలో కట్టుదిట్టమైన భద్రత కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు వచ్చే ఆసీస్ ప్లేయర్ల కుటుంబ సభ్యులకు భద్రత ఇవ్వాలని వాళ్లు అడిగారట.

అంతేకాదు, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను కూడా ఇంగ్లండ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఇప్పటికి చాలా సార్లు అతను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే గోల గోల చేశారు. సౌతాఫ్రికా సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ చేసి దొరికిపోయావంటూ స్టీవ్ స్మిత్‌ను ఎద్దేవా చేశారు. 'నువ్వు ఏడవడం టీవీలో చూశాం' అంటూ ఎగతాళి చేశారు. అయితే రెండో టెస్టులో స్టేడియంలో ఉన్న స్మిత్ తల్లిని వాళ్లు బాగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది.

అయితే ఆమె స్మిత్ తల్లి అని అప్పటికి ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు తెలియదట. కేవలం ఆస్ట్రేలియన్ అని చూడగానే.. ఆమెను తిడుతూ బాగా వేధించారు. ఇది తట్టుకోలేని ఆమె స్టేడియం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అదే స్మిత్ తల్లి ఆమే అని తెలిస్తే వాళ్లు ఏం చేసేవారో? అని కొందరు భయపడతున్నారు. గురువారం నాడు హెడింగ్లే వేదికగా మూడో టెస్టు మొదలవుతుంది.

Story first published: Wednesday, July 5, 2023, 21:11 [IST]
Other articles published on Jul 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+