ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కొంత తేలిపోయిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగాడు. ఏకంగా నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 393 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. బదులుగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో గట్టి పోటీ ఇచ్చింది. ఉస్మాన్ ఖవాజా (141) అద్భుతంగా ఆడాడు. మూడో రోజు వర్షం కారణంగా మ్యాచ్ పెద్దగా జరగలేదు. ఈ క్రమంలో 386 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ మంచి స్కోరు చేసింది.

అయితే ఇంగ్లండ్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా అనుకున్నంత స్కోరు చేయలేకపోయాడు. రాణిస్తారనుకున్న జో రూట్ (46), హ్యారీ బ్రూక్ (46), బెన్ స్టోక్స్ (43) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా ఎవరూ కూడా కనీసం 30 పరుగుల మార్కు దాటలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 280 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ అదరగొట్టాడనే చెప్పాలి. అతనితోపాటు నాథన్ లియాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా లియాన్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రూట్, బ్రూక్, బెయిర్‌స్టో, ఓలీ రాబిన్సన్ వంటి కీలక ప్లేయర్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
కమిన్స్, నాథన్ లియాన్ ఇలా చెరో నాలుగు వికెట్లతో రాణించగా.. హాజిల్‌వుడ్, బోలాండ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఆసీస్ ముందు 280 పరుగుల లక్ష్యం నిలిచింది. మరో రోజు ఆట మిగిలే ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించేస్తారని, అదే కనుక వాళ్ల ముందు 300 టార్గెట్ కనుక ఉండి ఉంటే ఇంగ్లండ్ గెలిచేదని పలువురు అంటున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి.