Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: మ్యాచ్ ముగిశాక కలవని ఇంగ్లండ్, ఆసీస్ టీమ్స్.. క్లారిటీ ఇచ్చిన బెన్ స్టోక్స్!

ఈసారి కూడా యాషెస్ సిరీస్ మంచి థ్రిల్లింగ్‌‌గా సాగింది. చివరి టెస్టులో ఇంగ్లండ్ అద్భుతమైన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ 2-2తో డ్రా అయింది. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత కూడా రెండు జట్ల మధ్య స్నేహభావం పెరగలేదని కనిపిస్తోంది. సాధారణంగా యాషెస్ ముగిసిన తర్వాత రెండు టీమ్స్ కలుస్తాయి.

ఈ మీటింగ్‌లో ప్లేయర్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది అంతా కలిసి డ్రింక్ తీసుకుంటారు. కానీ ఈసారి ఈ కార్యక్రమం జరగలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. యాషెస్ మంచి హీట్‌లో జరగడంతో రెండు టీమ్స్ మధ్య మనస్పర్థలు వచ్చేయామో? అని అనుకుంటున్నారు.

Ashes 2023 England and Australia teams fail to meet for customary drinks

ఇంగ్లండ్ క్యాంప్‌లో రిటైర్ అవుతున్న ప్లేయర్లను గౌరవించడం, ఇతర కార్యక్రమాలు జరగడంతో వాళ్ల ముగింపు వేడుకలు బాగా లేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ టీంకు ఇన్‌ఫాం చేయలేదట. దీంతో వాళ్లు వెయిట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు కూడా కామెంట్ చేశాడు.

దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్లారిటీ ఇచ్చాడు. తమ ముగింపు వేడుకలు అనుకున్న దాని కన్నా ఆలస్యంగా ముగిశాయని చెప్పాడు. చివర్లో కొన్ని కార్యక్రమాలు కలవడంతో ఇది ఆలస్యమైందని అన్నాడు. ఈ కారణంగానే ఆసీస్ టీంను కలవలేకపోయాని వివరణ ఇచ్చాడు. అయితే వాళ్లను ఆ తర్వాత కలుస్తామని స్పష్టం చేశాడు.

'మా ముగింపు కార్యక్రమాలు అనుకున్న దాని కన్నా బాగా ఆలస్యం అయ్యాయి. చివర్లో మరికొన్ని కార్యక్రమాలు చేరడంతో ఈ ఆలస్యం జరిగింది. ఈ కారణంగా డ్రెస్సింగ్ రూంలో కాకుండా.. నైట్ క్లబ్‌లో కలుద్దామని డిసైడ్ అయ్యాం' అని స్టోక్స్ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. అంటే ఈ రెండు టీమ్స్ సభ్యులు నైట్ క్లబ్‌లో కలుస్తారన్నమాట.

Story first published: Tuesday, August 1, 2023, 12:59 [IST]
Other articles published on Aug 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+