Ashes 2023: ఈ డ్రా ఓటమి కన్నా దారుణం: బెన్ స్టోక్స్
యాషెస్ నాలుగో టెస్టులో అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఇంగ్లాండ్ కు నిరాశే మిగిలింది. ఆ టీమ్ గెలడానికి మరో ఐదు వికెట్లు అవసరం ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి మూడు మ్యాచుల్లో రెండింట నెగ్గిన ఆస్ట్రేలియా ఈసారి కూడా యాషెస్ సీరీస్ ను కైవసం చేసుకుంది.
నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ ధాటిగా ఆడి ఏకంగా 592 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ నాలుగోరోజు ఆసీస్ బ్యాటర్లు గొప్ప పోరాటపటిమని చూపించారు. ముఖ్యంగా లబుషేన్ 111 పరుగులతో రాణించాడు.

ఇక చివరిదైన ఐదోరోజు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ మొదలుపెట్టడం కుదర్లేదు. ఈ కారణంగా మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీనివల్ల ఇంగ్లాండ్ కు చాలా నష్టం జరిగింది. ఈ మ్యాచ్ కనుక ఇంగ్లాండ్ గెలిచి ఉంటే.. చివరి మ్యాచ్ కీలకంగా మారేది. ఆ మ్యాచ్ గెలిచిన వారికే యాషెస్ సిరీస్ దక్కేది.
కానీ నాలుగో టెస్ట్ డ్రా అవడంతో సీరీస్ ఆసీస్ వశమైంది. ఈ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. గెలవడానికి ఎం చెయ్యాలో అంతా చేశామని, కానీ ఇలా వర్షం వల్ల మ్యాచ్ డ్రా అవడం చాలా బాధాకరమని అన్నాడు. ఈ డ్రాను అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. అయితే చివరి మ్యాచులో గెలవడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశాడు.
"3-1 తేడాతో ఓడాం అనేకంటే.. 2-2 తో సీరీస్ డ్రా చేసుకున్నాం అంటే కొంచం గౌరవంగా ఉంటుంది. చివరి మ్యాచులో గెలవడమే మా టీమ్ గోల్. అందరూ అదే మైండ్ సెట్ తో ఉన్నారు. మేం పూర్తిగా పాజిటివ్ దృక్పథం తో ఉన్నాం" అని స్టోక్స్ తెలిపాడు. అయితే ఓవల్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ సీరీస్ డిసైడర్ అయ్యుంటే ఇంకా బాగుండేదని చెప్పాడు. ఈ టెస్టులో ఫలితం వచ్చి ఉంటే.. నెక్స్ట్ మ్యాచ్ మరింత మజాగా ఉండేదన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications