Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బాజ్‌బాల్ ఎఫెక్స్.. ధోనీ రికార్డు బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్!

యాషెస్ సిరీసులో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. హెడింగ్లే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇదే జోరు కొనసాగించి నాలుగో టెస్టులో కూడా గెలవాలని ఇంగ్లండ్ అనుకుంటోంది. మూడో టెస్టు విజయంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ 251 పరుగుల టార్గెట్‌ను కేవలం 50 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. దీంతో అత్యధిక సార్లు 250+ స్కోర్లను ఛేజ్ చేసిన జట్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇలా 250+ స్కోరును ఛేజ్ చేయడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ హయాంలో భారత జట్టు నాలుగు సార్లు 250+ పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది.

Ashes 2023 Ben Stokes breaks MS Dhoni record with headinglay win

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యంగా కనిపించింది. అయితే యువ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (75) అరుదైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన అతను.. ఈ క్రమంలో అత్యంత తక్కువ బంతుల్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

అతనితోపాటు క్రిస్ వోక్స్ (32 నాటౌట్) కూడా రాణించాడు. ఇక మార్క్‌వుడ్ కేవలం 8 బంతుల్లోనే 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంతితో కూడా అతను చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Monday, July 10, 2023, 17:43 [IST]
Other articles published on Jul 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+