Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఆసీస్ దెబ్బకు మళ్లీ బెంబేలెత్తిన బాజ్‌బాల్.. స్టోక్స్ భారీ సెంచరీ వృధా!

ఇంగ్లండ్ బాజ్‌బాల్ మరోసారి ఫెయిలైంది. ఎంత కష్టపడినా వాళ్లు ప్రపంచ నెంబర్ వన్ ఆస్ట్రేలియాపై గెలవలేకపోయారు. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్.. రెండో వన్డేలో కూడా ఓటమి చవిచూసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 370 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. జాక్ క్రాలీ (3), ఓలీ పోప్ (3), జో రూట్ (18) ముగ్గురూ ఘోరంగా ఫెయిలయ్యారు.

ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (4) కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయితే కుర్ర ఓపెనర్ బెన్ డకెట్ (83), కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) గట్టి పోటీ ఇచ్చారు. డకెట్ అవుటైన తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో (10) వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. ఓవర్ చివరి బంతి షార్ట్ బాల్ కావడంతో దాన్ని కిందకు వంగి వదిలేసిన అతను.. క్రీజును మార్క్ చేసి నాన్‌స్ట్రైకర్‌తో మాట్లాడేందుకు ముందుకు కదిలాడు.

Ashes 2023 BazBall failed in second test as Stokes 150 goes in vain

సరిగ్గా అదే సమయంలో తన చేతిలోని బంతిని ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ.. వికెట్ల మీదకు విసిరాడు. అది వికెట్లను కూల్చడంతో ఆసీస్ జట్టంతా అప్పీల్ చేసింది. అంపైర్ కూడా అది అవుట్ ఇచ్చేశాడు. దీంతో ఇంగ్లండ్ విజయావకాశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కాసేపటికే స్టోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో స్టువర్ట్ బ్రాడ్ (11), జోష్ టంగ్ (19) కొంత పోరాడినా ఫలితం లేకపోయింది.

దీంతో ఆ జట్టు కేవలం 327 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ 2023 సిరీసులో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. కామెరూన్ గ్రీన్ ఒక వికెట్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, July 2, 2023, 21:49 [IST]
Other articles published on Jul 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+