Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: మూడో టెస్టులో ఓటమి ఎఫెక్ట్.. ఆ స్టార్‌పై వేటు వేయనున్న ఆస్ట్రేలియా!

యాషెస్‌ 2023లో తొలి ఓటమి ఎదుర్కొని నాలుగో మ్యాచ్‌కు ఎదురవుతున్న ఆసీస్ ఒక సీనియర్ ప్లేయర్‌పై వేటు వేసేలా కనిపిస్తోంది. అతనెవరో కాదు.. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ సిరీసులో ఆడిన మూడు మ్యాచుల్లో వార్నర్ ఒక్క మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. మూడో టెస్టులో అయితే అత్యంత దారుణంగా ఫెయిలయ్యాడు. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టేయాలని ఆసీస్ భావిస్తోంది.

గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన కామెరూన్ గ్రీన్.. నాలుగో టెస్టులో తిరిగొచ్చే అవకాశం ఉంది. అతని కోసం మిచెల్ మార్ష్‌ను పక్కన పెట్టాలి. కానీ అతను మూడో టెస్టులో సెంచరీతో రాణించాడు. నాలుగేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో అతను సెంచరీ బాదడంతో.. అతన్ని తీసేయడం కరెక్ట్ కాదని ఆసీస్ టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక హెడింగ్లే టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వార్నర్ మరీ దారుణంగా ఫెయిలయ్యాడు.

Ashes 2023 Australia to axe star player after first loss

సుమారు రెండేళ్లుగా వార్నర్ టెస్టు బ్యాటింగ్ చాలా పేలవంగానే సాగుతోంది. సౌతాఫ్రికాపై డబుల్ సెంచరీ బాదినా కూడా 2021 నుంచి ఇప్పటి వరకు అతని టెస్టు యావరేజ్ కేవలం 28 మాత్రమే. దీంతో వార్నర్‌పై వేటు తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మూడో టెస్టు తర్వాత మాట్లాడిన ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్.. తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏమైనా జరగొచ్చని చెప్పాడు.

'మేం ముందుగా వికెట్‌ను చూసి, టీంతో మాట్లాడిన తర్వాతనే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను సెలెక్ట్ చేస్తాం' అని కమిన్స్ స్పష్టం చేశాడు. ఈ టెస్టుకు గ్రీన్‌తోపాటు హాజిల్‌వుడ్ కూడా జట్టుతో చేరే అవకాశం ఉంది. దీంతో ఆసీస్‌ టీం సెలెక్షన్ మరింత తలనొప్పిగా మారనుంది. నాలుగో టెస్టులోనే సిరీస్ ముగించేయాలని, చివరి టెస్టు వరకు ఫలితం కోసం ఎదురు చూడకూడదని ఆసీస్ అనుకుంటోంది. కాబట్టి వాళ్లు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాాశాలు చాలానే ఉన్నాయి.

Story first published: Monday, July 10, 2023, 16:18 [IST]
Other articles published on Jul 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+