Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బెయిర్‌స్టో అవుట్‌లో కొత్త కోణం.. షాకింగ్ విషయం వెల్లడించిన ఆసీస్ స్టార్!

యాషెస్ సిరీస్‌ను బెయిర్‌స్టో రనౌట్ బాగా వేడెక్కించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజాలు కూడా తమ తమ జట్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ఆయా దేశ ప్రధానులు కూడా తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చారు. ఇంత జరుగుతుండగా.. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఇలా అవుట్ చేయాలని ముందుగా బెయిర్‌స్టోనే ప్రయత్నించాడని చెప్పాడు.

ఈ విషయంలో ఇంగ్లిష్ మీడియా అంతా కలిసి బెయిర్‌స్టోను అన్యాయంగా అవుట్ చేశారని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెగ గొడవ చేస్తున్నారు. అయితే అసలు దీనంతటికీ కారణం బెయిర్‌స్టోనే అని ట్రావిస్ హెడ్ మాటలు వింటే అర్థం అవుతోంది. బెయిర్‌స్టో అవుటైనప్పుడు ట్రావిస్ హెడ్ వెళ్లి అతనితో ఏదో మాట్లాడాడు. అదేంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన హెడ్.. సంచలన విషయం వెల్లడించాడు.

Travis Head

యాషెస్ తొలి టెస్టులో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, తనను బెయిర్‌స్టో ఇలాగే అవుట్ చేసేందుకు ప్రయత్నించాడని హెడ్ చెప్పాడు. బెయిర్‌స్టో అలా అవుటవగానే తనకు అదే విషయం గుర్తుచేశానని హెడ్ అన్నాడు. తొలి టెస్టులో బెయిర్‌స్టో తనను ఇలాగే అవుట్ చేస్తానంటూ బెదిరించాడని తెలిపాడు. ఈ క్రమంలోనే జానీ బెయిర్‌స్టోతో తన సంభాషణనను బయటపెట్టాడు.

'అలా అవుటైనందుకు జానీ అంత సంతోషంగా లేడు. అప్పుడు నేను గత వారం జరిగిన ఘటనను అతనికి గుర్తుచేశా. ఓవర్ అయిపోవడంతో నేను క్రీజు వదిలి ముందుకొచ్చా. అంతలోనే అవుట్ చేస్తారనే భయంతో మళ్లీ బ్యాటును క్రీజులో పెట్టేశా. అప్పుడు జానీని చూసి ఇప్పుడు కూడా వికెట్లు కూల్చి అవుటంటావా? అని అడిగా. కచ్చితంగా అదే చేస్తా అంటూ నన్ను బెదిరించి అవతలి ఎండ్‌కు వెళ్లిపోయాడు' అని హెడ్ గుర్తుచేసుకున్నాడు.

ఇప్పుడు అదే మాదిరి బెయిర్‌స్టోను అవుట్ చేయడంతో అందరూ అది పెద్ద తప్పు అంటున్నారని విమర్శించాడు. ఈ విషయం బయటకు రావడంతోపాటు అదే మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను అచ్చం అలెక్స్ క్యారీలాగే బెయిర్‌స్టో అవుట్ చేయడానికి ప్రయత్నించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇదంతా చూసిన ఫ్యాన్స.. అందుకే బెయిర్‌స్టోను ఆసీస్ అలా అవుట్ చేసిందని అంటున్నారు.

Story first published: Tuesday, July 4, 2023, 18:53 [IST]
Other articles published on Jul 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+