Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2021: ఇంగ్లండ్ త‌డ‌‘బ్యాట్‌’.. రెండో రోజు కూడా ఆసీస్‌దే

Ashes 2021: Australia Dominated Second day Game in Boxing Day Test Match

మెల్‌బోర్న్‌: యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ ఫేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతుంది. మూడో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆ జ‌ట్టు ఇంకా 51 ప‌రుగులు వెనుక‌డి ఉంది. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు చేతులెత్తేయ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ 4 వికెట్ల న‌ష్టానికి 31 ప‌రుగులు చేసింది. క్రీజులో 12 ప‌రుగుల‌తో కెప్టెన్ రూట్, 2 ప‌రుగుల‌తో స్టోక్స్‌ ఉన్నారు. 82 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. జ‌ట్టు స్కోర్ 7 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గానే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ క్రాలీ 5 ప‌రుగుల‌కే స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అవ‌గా.. ఆ త‌ర్వాతి బంతికే డేవిడ్ మ‌లాన్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు.

ఆ కాసేప‌టికే జ‌ట్టు స్కోర్ 22 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా మూడు, నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్‌. 7 ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ హ‌మీద్ బోలాండ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాతి రెండు బంతుల‌కే బోలాండ్ బౌలింగ్‌లో జాక్ లీచ్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 22 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ రూట్, ఆల్‌రౌండ‌ర్ స్టోక్స్ మరో వికెట్ ప‌డ‌కుండా ఆడి రోజును ముగించారు. దీంతో ఆస్ట్రేలియాను భారీ స్కోర్ చేయ‌నీయ‌కుండా బౌల‌ర్లు కట్ట‌డి చేసిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఆ ఆనందం ఎంతో సేపు మిగ‌ల లేదు. దీంతో రెండో రోజు ఆస్ట్రేలియానే అధిప‌త్యం కొన‌సాగించింది. మొత్తం 83 ఓవ‌ర్ల‌పాటు సాగిన నేటి ఆట‌లో 237 ప‌రుగులు న‌మోద‌వ‌గా 13 వికెట్లు నెల‌కూలాయి.

ఇక ఉద‌యం 61-1 స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 76 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 2 ఫోర్ల‌తో 10 ప‌రుగులు చేసిన నాథ‌న్ లియోన్‌ను రాబిన్స‌న్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత జ‌ట్టు స్కోర్ 84 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న ల‌బుశేన్‌ను ఒక్క ప‌రుగుకే మూడో వికెట్‌గా ఔట్ చేశాడు మార్క్‌వుడ్‌. ఆస్ట్రేలియా స్కోర్ 110 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా ఒక ఫోర్ సాయంతో 16 ప‌రుగులు చేసిన స్మిత్‌ను అండ‌ర్స‌న్ ఔట్ చేశాడు. అనంత‌రం హెడ్‌తో క‌లిసి ఓపెన‌ర్ హ‌రీస్ ఐదో వికెట్‌కు 61 ప‌రుగులు జోడించాడు. ఈ క్ర‌మంలో 27 ప‌రుగులు చేసిన హెడ్‌ను రాబిన్స‌న్ ఫెమిలియ‌న్ చేర్చాడు. హెడ్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఉన్నాయి. ఆ కాసేప‌టికే 76 ప‌రుగులు చేసిన ఓపెనర్ మార్క‌స్ హ‌రీస్‌ను అండ‌ర్స‌న్ ఔట్ చేశాడు.

189 బంతులు ఎదుర్కొన్న హ‌రీస్ 7 ఫోర్ల‌తో 76 ప‌రుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 180 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది. అనంత‌రం గ్రీన్‌, వికెట్ కీప‌ర్ అలెక్స్ కారీ ఆస్ట్రేలియాను అధిక్యంలోకి తీసుకెళ్లారు. జ‌ట్టు స్కోర్ 207 పరుగుల వ‌ద్ద ఉండ‌గా.. 17 ప‌రుగులు చేసిన గ్రీన్‌ను జాక్ లీచ్ ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా స్కోర్ 219 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 19 ప‌రుగులు చేసిన అలెక్స్ కారీని బెన్ స్టోక్స్ ఔట్ చేశాడు. ఈ క్ర‌మంలో కెప్టెన్ క‌మిన్స్‌, మిచెల్ స్టార్క్ తొమ్మిదో వికెట్‌కు 34 ప‌రుగులు జోడించారు. 21 ప‌రుగులు చేసిన క‌మిన్స్ అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. చివ‌రి వికెట్‌గా 6 ప‌రుగులు చేసిన బోలాండ్‌ను మార్క్ వుడ్ ఔట్ చేయ‌డంతో 267 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 24 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇంగ్లీష్ బౌల‌ర్ల‌లో అండ‌ర్స‌న్ 4 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. రాబిన్స‌న్‌, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు తీశారు. జాక్ లీచ్‌, స్టోక్స్ త‌లో వికెట్ తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 82 ప‌రుగుల అధిక్య‌త సాధించింది.

Story first published: Monday, December 27, 2021, 13:51 [IST]
Other articles published on Dec 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+