For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ 2019: రాయ్ ఔట్... ఆఖరి టెస్టుకు ఇంగ్లాండ్ రెండు మార్పులు

 Ashes 2019: Struggling Roy left out by England, Stokes passed fit to bat


హైదరాబాద్:
ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో ఆఖరి టెస్టుకు ఇంగ్లాండ్ తన తుది జట్టుని ప్రకటించింది. ఓవల్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు నుంచి ఓపెనర్ జేసన్ రాయ్‌ను సెలక్టర్లు తప్పించారు. పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్ర పడిన జేసన్ రాయ్ ఈ సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు.

ఈ సిరీస్‌కు ముందు కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉన్న జేసన్ రాయ్‌‌ని ఓపెనర్‌గా బరిలోకి పంపినా ఆకట్టుకోలేకపోయాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన 29 ఏళ్ల జేసన్ రాయ్‌ 110 పరుగులు మాత్రమే చేసి ఘోరంగ విఫలమయ్యాడు. ఇందులో అతడి అత్యధిక స్కోరు 31.

ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో 18 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ జట్టు యాషెస్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. చివరగా 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత గ్రెగ్‌ చాపెల్‌, రీకీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌ల సారథ్యంలోని రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినా.. యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయారు.

ఈ నేపథ్యంలో చివరి టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ తుది జట్టులో కీలకమార్పులు చేసింది. ఆల్‌ రౌండర్లకే పెద్ద పీట వేస్తూ జేసన్ రాయ్‌ను తుది జట్టు నుంచి తప్పించింది. దీంతో ఆఖరి టెస్టుకు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆల్‌ రౌండర్లు క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కర్రన్‌లను ఎంపిక చేసింది.

మరోవైపు క్రెయిగ్‌ ఓవర్టన్‌ను కూడా ఆఖరి టెస్టు నుంచి తప్పించారు. బెన్‌ స్టోక్స్‌ భుజం గాయం కారణంగా చివరి టెస్టులో బౌలింగ్‌ చేసే అవకాశాలు లేవు. కేవలం అతన్ని బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ చివరి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే మాత్రం కెప్టెన్‌గా టిమ్‌ పైనీ అరుదైన ఘనత సాధిస్తాడు.

ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు:
జో రూట్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, రోర్ బర్న్స్, జోస్ బట్లర్ శామ్ కర్రన్, జోయ్ డేన్లే, జాక్ లీచ్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్

Story first published: Thursday, September 12, 2019, 13:10 [IST]
Other articles published on Sep 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+